Hyderabad: దసరా సెలవులకు ఊరు వెళ్తున్నారా ? పోలీసులు సూచిస్తున్న జాగ్రత్తలు ఇవే..

|

Sep 30, 2024 | 5:43 PM

దసరా పండుగను తమ స్వగ్రామాల్లో జరుపుకునేందుకు హైదరాబాద్ జనం తరలివెళ్తున్నారు. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోయే అవకాశముంది. దీంతో దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు.

Hyderabad: దసరా సెలవులకు ఊరు వెళ్తున్నారా ? పోలీసులు సూచిస్తున్న జాగ్రత్తలు ఇవే..
Hyderabad Police Alert
Follow us on

దసరా పండుగను తమ స్వగ్రామాల్లో జరుపుకునేందుకు హైదరాబాద్ జనం తరలివెళ్తున్నారు. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోయే అవకాశముంది. దీంతో దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీస్ వారి ముఖ్య సూచనలు

 దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్ల లో భద్రపర్చుకోండి లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి.

 సెలవులలో బయటకు వెళుతున్నప్పుడు సెక్యూరిటి అలారం మరియు మోషన్ సెన్సర్ ను ఏర్పాటు చేసుకోవడం మంచింది.

 మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న తాళము అమర్చుకునడం మంచిది.

 తాళము వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే మీ యొక్క స్థానిక పోలీసు స్టేషన్ లో సమాచారము ఇవ్వండి.

 మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వండి లేదా డయల్ 100 కు ఫోన్ చేయండి.

 మీ వాహనాలను మీ ఇంటి ఆవరణ లోనే పార్కు చేసుకొండి. మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి, మరియు మీకు వీలైతే చక్రాలకు చైన్స్ తో కూడా లాక్ వేయడం మంచిది.

 నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే సెక్యూరిటి గార్డులుగా నియమించుకోండి.

 మీ ఇంట్లో అమర్చిన CC Camera లను online లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి.

 మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, News Papers & పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి. వాటిని కూడా గమనించి దొంగతనాలకు పాల్పడుతారు అన్న విషయాన్ని గమనించండి.

 మెయిన్ డోర్ కి తాళం కప్ప వేసినప్పటికి అవి కనిపించకుండా కర్టెన్స్ తో కవర్ చేయడం మంచిది.

 బయటకు వెళ్లేటప్పుడు ఇంటి లోపల మరియు బయట కొన్ని లైట్లు వేసివుంటే మంచిది.

 మీ ఇంటి దగ్గర మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తు ఉండమని చెప్పడం మంచిది.

 మీ ఇంటికి వచ్చే, వెళ్ళే దారులు మరియు ఇంటిలోపల CC Camera లు అమర్చు కొని DVR కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశం లో ఉంచండి.

 అల్మరా మరియు కప్ బోర్డ్స్ కు సంబంధించిన తాళాలు కామన్ ఏరియా అయిన చెప్పుల స్టాండ్, పరుపులు మరియు దిండ్ల క్రింద, అల్మరా పైన, డ్రెస్సింగ్ టేబుల్ లో మరియు కప్ బొర్డ్స్ లో ఉంచకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశం లో ఉంచడం మంచిది.

 బంగారు ఆభరణాలు వేసుకొని ఫంక్షన్ లకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రతలు తీసుకోండి.

 సోషల్ మిడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడము మంచిది కాదు.

 సోషల్ మిడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడము మంచిది కాదు.

 కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి.

 మీకు ఎవరిమీదైనా అనుమానం వస్తే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు గాని, సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ 9490617100 కు లేదా మా వాట్సాప్ నెంబర్ 9490617444 కు dial చేయండి.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి