Hyderabad: సండే క‌రోనా వ్యాప్తికి సెల‌వు లేదండి..! ఇంత డ్యామేజ్ జరిగినా అసలు భయమన్నదే లేదుగా..?

ఓ వైపు కరోనా మహమ్మారి విరుచుకుపడుతుంది. ఒమిక్రాన్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉంది. మరోవైపు నాన్‌వెజ్‌ ప్రియులు మాత్రం భయమన్నదే లేకుండా ప్రవర్తిస్తున్నారు.

Hyderabad: సండే క‌రోనా వ్యాప్తికి సెల‌వు లేదండి..! ఇంత డ్యామేజ్ జరిగినా అసలు భయమన్నదే లేదుగా..?
Crowd At Fish Market

Updated on: Jan 09, 2022 | 11:54 AM

ఓ వైపు కరోనా మహమ్మారి విరుచుకుపడుతుంది. ఒమిక్రాన్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉంది. మరోవైపు నాన్‌వెజ్‌ ప్రియులు మాత్రం భయమన్నదే లేకుండా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా సీ ఫుడ్‌ ఇష్టపడేవాళ్లు ఆదివారం వచ్చిందంటే చాలు చేపల మార్కెట్‌కు ఎగబడుతున్నారు. హైదరాబాద్‌ రాంనగర్‌లోని చేపల మార్కెట్‌ వద్ద కనిపించి సందడి చూస్తుంటే.. ఇది ఖచ్చితంగా కరోనాకు అడ్డాగానే చెప్పవచ్చు.

ఆదివారం వచ్చిందంటే..ఖచ్చితంగా నాన్‌ వెజ్‌ తినాల్సిందేనా..? అదేమైనా రూలా..? ఒకవేళ నిజంగా తినాలన్నా.. భౌతికదూరం, మాస్కులు ధరించడం లాంటి జాగ్రత్తలు వీరికి వర్తించవా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో కరోనా మహమ్మారి సోకదు అన్నట్లే ఉంది వీరి ప్రవర్తన. ఇంత డ్యామేజ్ జరిగాక కూడా ఇలా ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. ఒకరికి కరోనా వచ్చినా..  ఇంట్లో ఉన్న మిగతా అందరినీ మహమ్మారి వెంటాడుతుందని అందరూ  గుర్తుంచుకోవాలి. కాగా అధికారులు కూడా వీరిని ఎడ్యకేట్ చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. కరోనా టైంలో భౌతిక దూరం పాటించటం, మాస్క్ ధరించడం, శుభ్రత పాటించడం ఎంతో అవసరం అంటున్నారు వైద్య నిపుణులు.

Also Read: Tragedy: రైలు పట్టాలపై కూర్చొని పబ్​జీ గేమ్.. ట్రైన్ ఢీకొని అన్నదమ్ములు స్పాట్ డెడ్

ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ… ఎలానో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్