Hyderabad: భాగ్యనగరంలో గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షానికి చాలా ప్రాంతాల్లో వరద సమస్య ఇబ్బంది పెడుతుంది. ఈ ఎడతెరిపి లేని వర్షానికి బేగం బజార్‌లోని ఓ ఇల్లు పై కప్పు కూలి ఆ ఇంటి కొంత భాగం నేలకు ఓరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ కొంత ఆస్తి నష్టం జరిగింది.
విషయం తెలుసుకున్న స్థానిక నేతలు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు బరోసానిచ్చారు.
మరో వైపు మంగర్ బస్తీలో శిథిలావస్థకు చేరుకున్న భవనాల నుంచి స్థానికులను ఖాళీ చేసి వేరే చోట ఏర్పాటు చేసిన కమిటీ హాల్లో తలదాచుకోవాలని ఆసిఫ్ నగర్ ఎం.ఆర్.ఓ తో పాటు స్థానిక కార్పొరేటర్ స్థానికులను కోరారు. ప్రస్తుతం ఉంటున్న బిల్డింగులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వారిని ఒప్పించి దగ్గరలో ఏర్పాటు చేసిన షెల్టర్‌లకి తరలిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండడం కరెక్ట్ కాదని.. పాత భవనాల లెక్కలు తీస్తున్నాయి అధికారులు.
కాగా, కంటిన్యూగా కురుస్తున్న వర్షానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అప్రమత్తమై చర్యలు చేపట్టింది. గురు, శుక్రవారం స్కూల్స్‌కి సెలవులు ఇవ్వగా.. శుక్ర, శనివారాలు నగర పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి