Restaurant Seized: కుళ్లిన మాంసంతో బిర్యానీ.. స్వీట్స్‌లో పురుగులు.. టాప్‌ హోటల్‌కు అధికారుల షాక్‌

Paradise Restaurant Seized: హైదరాబాద్‌ బిర్యానీ అంటే చాలు చాలామంది నోటిలో నీరురూతుంటుంది. భాగ్యనగరానికి ఎక్కడినుంచి వచ్చినా సరే.. ముందు వెనుక ఆలోచించకుండా బిర్యానీ

Restaurant Seized: కుళ్లిన మాంసంతో బిర్యానీ.. స్వీట్స్‌లో పురుగులు.. టాప్‌ హోటల్‌కు అధికారుల షాక్‌
Paradise Restaurant

Updated on: Mar 17, 2021 | 5:46 PM

Paradise Restaurant Seized: హైదరాబాద్‌ బిర్యానీ అంటే చాలు చాలామంది నోటిలో నీరురూతుంటుంది. భాగ్యనగరానికి ఎక్కడినుంచి వచ్చినా సరే.. ముందు వెనుక ఆలోచించకుండా బిర్యానీ తినే వెళుతుంటారు. అలాంటి ఫేమస్‌ బిర్యానీలల్లో ప్యారడైజ్ బిర్యానీ ఒకటి. ఈ బిర్యానీని చాలామంది ఇష్టపడుతుంటారు. అలాంటి బిర్యానీ ప్రియులకు ఎప్పుడూ ఊహించని పరిణామం ఎదురైంది. అలాంటి బ్రాండ్‌ బిర్యానీలో పురుగులు రావడంతో కస్టమర్లే షాక్‌ అయ్యారు.

మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని ప్యారడైజ్ పేరుతో నడుస్తున్న రెస్టారెంట్‌కు ఓ వ్యక్తి వెళ్లి బిర్యానీ, డబుల్‌కా మిఠా, స్వీట్‌ పాన్‌ ఆర్డర్‌ చేశాడు. బిర్యానీ తింటుండగా.. పురుగులు కనిపించాయి. దీంతోపాటు కిల్లీ, డబుల్‌ కా మిఠాలో కూడా పురుగులు కనిపించాయి. వెంటనే ఆ వ్యక్తి రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆయన మునిసిపల్‌ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శానిటేషన్ సిబ్బందితో కలిసి మంగళవారం ప్యారడైజ్‌ హోటల్‌‌లో తనిఖీలు నిర్వహించారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు చికెన్, మటన్ కుళ్లిపోయి ఉండడాన్ని గమనించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకొని హోటల్‌ను సీజ్ చేశారు. దీంతోపాటు 50 వేల జరిమానా కూడా విధించినట్లు మునిసిపల్ కమిషనర్ వెల్లడించారు.

Also Read:

MiG-21 Crash: కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. గ్రూప్ కెప్టెన్ మృతి.. విచారణకు ఆదేశించిన వాయుసేన

Ambani Bomb Scare : అంబానీ బాంబు కేసులో అనేక మలుపులు.. పేరుని తిరిగి తెచ్చుకోవడానికే ఈ పనిచేశానంటున్న సచిన్ వాజే