Hyderabad: ‘రేవంత్ రెడ్డి’ నోటీసులపై వెనక్కి తగ్గనంటున్న హెచ్‌ఎండీఏ.. రాజకీయాల కోసమే పేర్లు వాడుతున్నారంటూ..

Hyderabad: ఐఎఎస్ అధికారి ఇచ్చిన లీగల్ నోటీసు వెనక్కి తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి చేసిన డిమాండ్‌పై HMDA రియాక్ట్‌ అయ్యింది. ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలపై సీరియస్‌ అయింది.  రాజకీయ ఉద్దేశంతో అధికారుల పేర్లు వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది HMDA..

Hyderabad: ‘రేవంత్ రెడ్డి’ నోటీసులపై వెనక్కి తగ్గనంటున్న హెచ్‌ఎండీఏ.. రాజకీయాల కోసమే పేర్లు వాడుతున్నారంటూ..
HMDA on Revanth Reddy

Edited By: Ravi Kiran

Updated on: Jun 14, 2023 | 10:00 AM

Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డు లీజుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను హైదరాబాద్‌ మహా నగర్‌ అభివృద్ధి సంస్థ సీరియస్‌గా తీసుకుంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు జారీ చేసింది. మే 25న అరవింద్ కుమార్ తనకు పంపిన ఈ లీగల్ నోటీసుకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన లీగల్‌ నోటీసులను వెనక్కి తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు. అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు. అధికార పార్టీ అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకు తనను అణిచివేయాలనే ఈ నోటీసులు పంపారని ఆరోపించారు.

ఇంకా లీగల్ నోటీసులో పేర్కొన్న ఆరోపణలన్నీ బూటకమని తెలిపారు. ఓఆర్ఆర్ టెండర్ వ్యవహారంలో రాజకీయ నాయకుడిలా అరవింద్ కుమార్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధిక ఆదాయం వచ్చే ఆస్కారం ఉన్నా ఆ దిశగా ఆలోచన చేయడం లేదన్నారు రేవంత్‌ రెడ్డి. ప్రభుత్వం ఆదాయానికి గండికొట్టి కేవలం రూ.7380 కోట్లకే ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు ఓఆర్ఆర్ టోల్ వసూలు టెండర్ అని అన్నారు. అయితే రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై హెచ్ఎండిఏ స్పందించింది. రేవంత్ రెడ్డికి ఇచ్చిన లీగల్ నోటీసులను ఉపసంహరించుకునేది లేదని HMDA తేల్చి చెప్పింది. రాజకీయ ఉద్దేశంతో అధికారుల పేర్లు వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పనితీరుపై అపోహలు ప్రచారం చేశారని మండిపడింది. ఓఆర్‌ఆర్‌ టీఓటీ బిడ్‌ ప్రక్రియలో రూల్స్‌ పాటించామని, ఓఆర్ఆర్ టెండర్లను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని హెచ్ఎండిఏ స్పష్టం చేసింది. టీఓటీ చేయడం మొదటి సారి కాదని హెచ్‌ఎండీఏ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..