AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter Exams: ఇంటర్ పరీక్షలు రాసేందుకు కీలక మార్పులు.. పూర్తి వివరాలివే

ఇంటర్ పరీక్షల(Inter Exams) నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మే ఆరో తేదీ నుంచి ఫస్టియర్, ఏడో తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బెంచీకి ఒక విద్యార్థినే కూర్చోబెట్టనుండడంతో గతంతో...

Inter Exams: ఇంటర్ పరీక్షలు రాసేందుకు కీలక మార్పులు.. పూర్తి వివరాలివే
Board Exams
Ganesh Mudavath
|

Updated on: Apr 16, 2022 | 10:00 AM

Share

ఇంటర్ పరీక్షల(Inter Exams) నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మే ఆరో తేదీ నుంచి ఫస్టియర్, ఏడో తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బెంచీకి ఒక విద్యార్థినే కూర్చోబెట్టనుండడంతో గతంతో పోలిస్తే పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌(Hyderabad) , రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుకు తగ్గట్టుగా కేంద్రాలు ఎంపిక చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలతో పాటు శివారుల్లో ఉన్నత పాఠశాలల్లోనూ కేంద్రాలున్నాయి. కరోనా(Corona) తర్వాత పరీక్షలు జరగలేదు. రెండేళ్ల తర్వాత నిర్వహిస్తుండడంతో కేంద్రాలను జాగ్రత్తగా ఎంపిక చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కళాశాలల్లో విద్యుత్, ఫ్యాన్‌ సౌకర్యం ఉండేలా చూసుకుంటున్నారు. బెంచీకొకరు చొప్పున ‘జడ్‌’ ఆకారంలో కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో గదికి 20-25 మందికి మించకుండా కేటాయించారు.

హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనే డిగ్రీ తరగతులు కొనసాగుతున్నాయి. ఇంటర్‌ పరీక్షల సమయంలో డిగ్రీ తరగతులు నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు చెబుతున్నారు. ఈ మూడు జిల్లాల్లో 3.38 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు హాజరుకానున్నారు.

Also Read

Watch Video: రాణా దెబ్బకు పగిలిన ఫ్రిజ్.. హై స్పీడ్ బాల్‌కు స్పెషల్ ట్రీట్ అంటోన్న ఫ్యాన్స్..

Zomato: వారికి షాకిచ్చిన జొమాటో.. ఆ నిబంధనలు ఏకపక్షమంటూ ఆందోళనలు..

High Blood Pressure: అధిక రక్తపోటుకి ఇవే ముఖ్య కారణాలు.. అదుపులో లేకుంటే అంతే సంగతులు..!