Watch Video: రాణా దెబ్బకు పగిలిన ఫ్రిజ్.. హై స్పీడ్ బాల్‌కు స్పెషల్ ట్రీట్ అంటోన్న ఫ్యాన్స్..

KKR vs SRH IPL 2022: ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి విజయం సాధించింది.

Watch Video: రాణా దెబ్బకు పగిలిన ఫ్రిజ్.. హై స్పీడ్ బాల్‌కు స్పెషల్ ట్రీట్ అంటోన్న ఫ్యాన్స్..
Kkr Vs Srh Ipl 2022
Follow us
Venkata Chari

|

Updated on: Apr 16, 2022 | 10:06 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్‌లో, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) శుక్రవారం వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్‌లో కేకేఆర్ ప్లేయర్ నితీశ్ రాణా బ్యాట్‌ విధ్వంసం కనిపించింది. కోల్ కతా 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి పరిస్థితిలో, నితీష్ రాణా 36 బంతుల్లో 54 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో రాణా రెండు సిక్సర్లు, 6 ఫోర్లు కూడా బాదేశాడు. ఈ సమయంలో నితీష్ స్ట్రైక్ రేట్ 150గా నిలిచింది. హైదరాబాద్ జట్టులోని దాదాపు ప్రతి బౌలర్‌ను ఉతికి ఆరేశాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ సమయంలో, నితీష్ రాణా దూకుడైన బ్యాటింగ్‌కు హైదరాబాద్ బౌలర్లు నిస్సహాయంగా ఉండిపోయారు. ఈ క్రమంలోనే రాణా బాదిన ఓ బంతి నేరుగా డగౌట్‌లో ఉంచిన ఫ్రీజ్‌ను తాకడంతో అద్దం పగిలిపోయింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ తొలి బంతికి నితీశ్ ఈ సిక్సర్ బాదాడు. ఈ ఓవర్‌ను ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్ ఉమ్రాన్ మాలిక్ వేశాడు. మాలిక్ దాదాపు 150 కి.మీ. వేగంతో బంతిని వేశాడు. ఆపై రానా థర్డ్ మ్యాన్ వైపు కట్ షాట్ ఆడాడు.

నితీష్ ధాటికి ఈ షాట్ బౌండరీ దాటి సన్ రైజర్స్ జట్టు డగౌట్‌లో పడింది. ఇక్కడ, ఒక ఫ్రీజ్ ఉంది. దానిపై ఈ బంతి తగిలి ఫ్రీజ్ అద్దం పగిలింది. అదే ఓవర్ 5వ బంతికి షెల్డన్ జాక్సన్ కూడా ఉమ్రాన్ వేసిన బంతికి లాంగ్ సిక్స్ బాదాడు. ఈ బంతి 140 వేగంతో విసిరాడు.

కేకేఆర్‌పై సన్‌రైజర్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం..

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రస్తుతం మళ్లీ విజయాల బాట పట్టింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన హైదరాబాద్.. ప్రస్తుతం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం కోల్‌కతా జట్టు 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. జట్టు తరపున నితీష్ రాణా 36 బంతుల్లో అత్యధికంగా 54 పరుగులు చేశాడు. ఆండ్రీ రస్సెల్ 25 బంతుల్లో 49 పరుగులు చేశాడు.

అనంతరం సన్‌రైజర్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టు తరపున రాహుల్ త్రిపాఠి 37 బంతుల్లో 71 పరుగులు చేయగా, ఐడెన్ మార్క్రామ్ 36 బంతుల్లో 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Also Read: Watch Video: రాణా దెబ్బకు పగిలిన ఫ్రిజ్.. హై స్పీడ్ బాల్‌కు స్పెషల్ ట్రీట్ అంటోన్న ఫ్యాన్స్..

MI vs LSG Playing XI IPL 2022: తొలి విజయం దక్కేనా.. లక్నోతో పోరుకు సిద్ధమైన ముంబై.. ప్లేయింగ్ XIలో మార్పులు?

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే