Cyber Crime: పెట్టుబడులు పెడితే అధిక లాభాలు పొందవచ్చంటూ మీకు లింక్‌లు వస్తున్నాయా..? అయితే తస్మాత్‌ జాగ్రత్త

|

Jul 05, 2021 | 1:09 PM

Cyber Crime: ఆన్‌లైన్‌ పెట్టుబడి పెడితే మీకు రెట్టింపు ఆదాయం పొందవచ్చని, లేకపోతే కొన్ని గ్రూపుల్లో సభ్యులుగా చేరితే లాభంతో పాటు బోనస్‌ కూడా పొందవచ్చంటూ రకరకాల..

Cyber Crime: పెట్టుబడులు పెడితే అధిక లాభాలు పొందవచ్చంటూ మీకు లింక్‌లు వస్తున్నాయా..? అయితే తస్మాత్‌ జాగ్రత్త
Follow us on

Cyber Crime: ఆన్‌లైన్‌ పెట్టుబడి పెడితే మీకు రెట్టింపు ఆదాయం పొందవచ్చని, లేకపోతే కొన్ని గ్రూపుల్లో సభ్యులుగా చేరితే లాభంతో పాటు బోనస్‌ కూడా పొందవచ్చంటూ రకరకాల లింక్ లతో సోషల్‌ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు సోషల్‌ మీడియాలో కొన్ని లింక్‌లను ఇస్తూ వాటిని క్లిక్‌ చేసి అందులో సభ్యులుగా చేరితే మీకు రోజురోజు ఆదాయం వస్తుందని కొందరు లింక్‌లను పంపిస్తున్నారు. ఇలాంటి లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, లేకపోతే మీరు నిలువునా సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతారని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీరు లింక్‌ ద్వారా సభ్యులుగా చేరితో ముందుగా మీకు అకౌంట్‌లో డబ్బులు వచ్చినట్లు చూపిస్తారు.. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆ లింక్‌, అప్లికేషన్స్‌ను బ్లాక్‌ చేసి మోసగిస్తారని, జాగ్రత్తగా ఉండాలంటూ అప్రమత్తం చేస్తున్నారు. అలాగే ఎంజీ ఆన్‌లైన్‌ పేరుతో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పెట్టుబడులు పెడితే ప్రతి రోజు లాభాలు పొందవచ్చని చెబుతూ మోసగాళ్లు లింక్‌లు పంపిస్తున్నారు. ఆ యాప్‌ డౌన్‌లో చేసుకుని పెట్టుబడులు పెట్టడం, మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయడం ద్వారా మోసగాళ్ల చేతిలో అడ్డంగా మోసపోతారని పోలీసులు వెల్లడిస్తున్నారు.

కాగా, ఇలాంటి లింక్‌లు సోషల్‌ మీడియాలోనూ, మొబైల్‌ నెంబర్లకు చాలా వస్తుంటాయి. వాటిని క్లిక్‌ చేస్తే మీ వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకులకు సంబంధించిన పూర్తి సమాచారం వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. అప్పుడు మీ బ్యాంకు అకౌంట్‌లో ఉన్న డబ్బులన్ని మాయమవుతాయి. ఇప్పటికే ఇలాంటి ఆన్‌లైన్‌ మోసాలకు ఎంతో మంది బలయ్యారని, ఇలాంటి మోసాలపై సైబర్‌ క్రైమ్‌ పోలీసు విభాగం ప్రత్యేక నిఘా పెట్టిందని పోలీసులు వివరిస్తున్నారు. ఎవరు ఎలాంటి లింక్‌లు పంపినా.. మెసేజ్‌లు పంపినా, ఫోన్‌లు చేసి మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు అడిగినా ఎట్టి పరిస్థితుల్లో చెప్పవదని సూచిస్తున్నారు. కొందరు లాటరీ పేరుతో లింక్‌లను పంపిస్తూ నిలువునా మోసగిస్తున్నారని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఎలాంటి లింక్‌లు ఓపెన్‌ చేసి డబ్బులు ఇన్వెస్ట్‌ చేయవద్దని సూచిస్తున్నారు. లేనిపోని లింక్‌లు, మెసేజ్‌లు పంపిస్తూ సైబర్‌ నేరగాళ్లు మీకు గాలం వేస్తున్నారని, ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నకిలీ లింక్‌లను నమ్మి మోసపోవద్దని పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

 

ఇవీ కూడా చదవండి:

SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లు తస్మాత్‌ జాగ్రత్త.. వారికి ఆ వివరాలు చెప్పవద్దని హెచ్చరించిన ఎస్‌బీఐ..!

CBSE Class 10 Result: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం.. ఫలితాలు విడుదల ఎప్పుడంటే..!