Telangana: ఈజీగా మనీ సంపాదిద్దామని ఆశపడ్డాడు.. కానీ.. కథ అడ్డం తిరిగింది.. చివరకు అలా..

Yadadri Bhuvanagiri district: ఈజీ మనీ కోసం డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ కేటుగాళ్లు విజృంభిస్తుండగా.. ఆన్ లైన్ బెట్టింగ్‌లో చిక్కుకొని యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు యువత ఆన్ లైన్ బెట్టింగ్‌కు ఆకర్షితులవుతున్నారు. బెట్టింగ్‌లో లక్షల రూపాయల పోగొట్టుకొని యువత అప్పుల పాలవుతున్నారు. చివరికి అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Telangana: ఈజీగా మనీ సంపాదిద్దామని ఆశపడ్డాడు.. కానీ.. కథ అడ్డం తిరిగింది.. చివరకు అలా..
Online Betting Suicide

Edited By:

Updated on: Jan 21, 2026 | 4:04 PM

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం తంగేడుపల్లి గ్రామానికి చెందిన బాలగోని శ్రీనివాసు, లక్షీ దంపతులకు ఇద్దరు కొడుకులు. వారిలో పెద్ద కొడుకు పవన్ కుమార్ (27) ఊరిలోనే పశువుల దాన షాప్ నిర్వహిస్తున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని అత్యాశతో పవన్ కుమార్.. ఆన్ లైన్ బెట్టింగ్‌కు ఆకర్షితుడయ్యాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో లక్షల డబ్బులు పోగొట్టుకున్నాడు. అప్పులు తీసుకువచ్చి మరి బెట్టింగ్ లో పవన్ కుమార్ పాల్గొనేవాడు.

అయితే.. డబ్బుల కోసం అప్పులు ఇచ్చిన వారు పవన్ కుమార్ ను నిలదీయడంతో తల్లిదండ్రులే అప్పులు చెల్లించారు. తిరిగి బెట్టింగ్‌లో డబ్బులు పెట్టవద్దని తల్లిదండ్రులు హెచ్చరించారు. అయినా తీరు మారని పవన్ కుమార్ అప్పులు చేసి ఆన్ లైన్ బెట్టింగ్‌లో పాల్గొని డబ్బులు పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక పవన్ కుమార్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.

ఓవైపు డబ్బులు పోయాయన్న బాధ.. మరోవైపు అప్పులు పెరగడంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు.. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని పవన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఆన్ లైన్ బెట్టింగ్‌లకు పాల్పడవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా బెట్టింగ్ పాల్పడితే.. ఆ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నారు. వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మట‌న్‌లోని ఈ పార్ట్ తింటే ఇక తిరుగుండదంతే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..