Olectra: హెచ్ఆర్‌టీసీ నుంచి ఒలెక్ట్రాకు 297 బస్సుల ఆర్డర్.. పూర్తి వివరాలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ తయారీలో అగ్రగామిగా ఉన్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్(Olectra Greentech Limited) హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (HRTC) నుండి తొమ్మిది మీటర్ల పొడవైన 297 నాన్-ఎయిర్ కండిషన్డ్(నాన్-ఏసీ) బస్సుల ప్రతిష్టాత్మకమైన ఆర్డర్‌ పొందింది. ఒలెక్ట్రా అధికారికంగా.. ఆ వివరాలు

Olectra: హెచ్ఆర్‌టీసీ నుంచి ఒలెక్ట్రాకు 297 బస్సుల ఆర్డర్.. పూర్తి వివరాలు
Olectra

Edited By: Ravi Kiran

Updated on: Apr 09, 2025 | 9:22 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్ తయారీలో అగ్రగామిగా ఉన్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్(Olectra Greentech Limited) హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (HRTC) నుండి తొమ్మిది మీటర్ల పొడవైన 297 నాన్-ఎయిర్ కండిషన్డ్(నాన్-ఏసీ) బస్సుల ప్రతిష్టాత్మకమైన ఆర్డర్‌ పొందింది. ఒలెక్ట్రా అధికారికంగా హెచ్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మురారి లాల్ నుండి లెటర్ ఆఫ్ అవార్డ్ (LOA)ని అందుకుంది. ఈ ఆర్డర్ ద్వారా సంస్థ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఒక రోడ్ రవాణా సంస్థ ఇన్ని ఎలక్ట్రిక్ బస్సులను నేరుగా కొనుగోలు చేయటం దేశంలో ఇదే ప్రథమం.

హిమాచల్ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలలో నడిపేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ఎలక్ట్రిక్ బస్సులు 30 మంది ప్రయాణీకుల సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ బస్సుల మొత్తం ఆర్డర్ విలువ రూ 424 కోట్లు, ఇది ఔట్‌రైట్ కొనుగోలు మోడల్ కింద అతిపెద్ద సింగిల్-స్టేట్ ఎలక్ట్రిక్ బస్సు సేకరణలలో ఒకటిగా నిలిచింది. ఈ విస్తరణ దేశంలో స్వచ్ఛమైన, స్థిరమైన ప్రజా రవాణాను ప్రోత్సహించడంలో ఒక ప్రధాన ముందడుగును సూచిస్తుంది.

‘ఎలక్ట్రిక్ బస్సుల కోసం భారతదేశం మొట్టమొదటి, అతిపెద్ద పూర్తి ఆర్డర్‌ను అందుకోవడం మాకు ఆనందంగా ఉంది. ఇది నిజంగా మాకు గర్వకారణం మరియు ఒలెక్ట్రా సామర్థ్యాలపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. మా తయారీ సామర్థ్యాన్ని విస్తరించడం మరియు మా సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడంపై మా నిరంతర దృష్టి సారిస్తాము, మేము క్లీనర్, గ్రీన్ మరియు మరింత స్థిరమైన భవిష్యత్తును నిర్మించడం కొనసాగిస్తాం’ ఒలెక్ట్రా సిఎండీ కె.వి.ప్రదీప్ అన్నారు.