ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని నర్సు మృతి
ఈ మధ్య సెల్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. నేటి సమాజంలో సెల్‌ఫోన్ అతి ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. ఇయర్ ఫోన్స్ పెట్టకుని పాటలు వింటూ రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన రేఖ(25) ఖైరతాబాద్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. గురువారం ఉదయం జిమ్‌కు వెళ్లిన రేఖ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఇంటికి బయలుదేరింది. ఖైరతాబాద్ ఎల్‌సీ గేట్-40 వద్ద పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. […]
ఈ మధ్య సెల్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. నేటి సమాజంలో సెల్‌ఫోన్ అతి ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. ఇయర్ ఫోన్స్ పెట్టకుని పాటలు వింటూ రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
ఢిల్లీకి చెందిన రేఖ(25) ఖైరతాబాద్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. గురువారం ఉదయం జిమ్‌కు వెళ్లిన రేఖ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఇంటికి బయలుదేరింది. ఖైరతాబాద్ ఎల్‌సీ గేట్-40 వద్ద పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో అటుగా వస్తున్న రైలు హారన్ వేసుకుంటూ వస్తున్నా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడంతో రేఖకు వినిపించలేదు. దీంతో రైలు ఆమెను ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో రేఖ అక్కడికక్కడే మృతిచెందింది.
రేఖ మృతి సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నాంపల్లి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రేఖ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా చాలామంది పట్టించుకోకుండా ప్రాణాలు కోల్పోతున్నారని రైల్వే పోలీసులు చెబుతున్నారు.