NIzam College: మరోసారి రోడ్డెక్కిన నిజాం కాలేజీ విద్యార్థులు.. పరీక్షలు రాసేది లేదంటూ..!

| Edited By: Jyothi Gadda

Dec 11, 2023 | 12:14 PM

ఆ 15 మంది విద్యార్థులకు పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తేనే తాము కూడా పరీక్షలు రాస్తామని విద్యార్థులు యాజమాన్యానికి అల్టిమేట్ జారీ చేశారు. ఫీజు చెల్లించకుంటే విద్యార్థులను పరీక్షకు అనుమతించేది లేదని యాజమాన్యం తెగేసి చెప్పటంతో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. విద్యార్థుల ఆందోళన ఎక్కువ అవ్వటంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది నిజాం కాలేజ్ యాజమాన్యం. వెంటనే రంగంలోకి దిగారు అబిడ్స్ పోలీసులు. పోలీసులు విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

NIzam College: మరోసారి రోడ్డెక్కిన నిజాం కాలేజీ విద్యార్థులు.. పరీక్షలు రాసేది లేదంటూ..!
Nizam College
Follow us on

హైదరాబాద్‌,డిసెంబర్‌11; నిజాం కాలేజీలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. సెమిస్టర్ ఫీజు చెల్లించలేదనే సాకుతో పలువురు విద్యార్థులను పరీక్ష రాయనీయకుండా నిజాం కాలేజ్ యాజమాన్యం అడ్డుకుందని ఆరోపించారు.. దీంతో ఒక్కసారిగా విద్యార్థులంతా కలిసి ఆందోళనకు దిగారు. ఫీజు చెల్లింపు విషయంలో గతంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని, చెప్పారు..అప్పడు కూడా ఫీజు కట్టించుకున్న తర్వాతే పరీక్ష రాసేందుకు యాజమాన్యం అనుమతి ఇచ్చిందని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. కానీ, ఈసారి మాత్రం తాము ఫీజు కట్టేందుకు రెడీగా ఉన్నాము అని తెలిపినా, యాజమాన్యం తమను పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే ఫీజు కట్టాలని తమకు పది రోజుల ముందు నోటీస్ ఇచ్చి ఉంటే నిర్దిష్ట సమయంలోనే ఫీజు చెల్లించే వాళ్ళమని మరి కొంతమంది విద్యార్థులు అంటున్నారు. ఉన్నపళంగా ఫీజు విషయాన్ని ముందుకు తీసుకొచ్చి తమను సెమిస్టర్ పరీక్షలు రాయనీయకుండా యాజమాన్యం అడ్డుకుంటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఇదిలా ఉంటే ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఫీజు చెల్లించిన విద్యార్థులు సైతం పరీక్షను బహిష్కరించారు. మొత్తం 15 మంది విద్యార్థులు సెమిస్టర్ ఫీజు కట్టలేదు. ఈ 15 మందిని పరీక్ష రాసేందుకు నిజాం కాలేజ్ యాజమాన్యం అనుమతించలేదు. దీంతో ఆ విద్యార్థులకు మద్దతుగా మిగిలిన విద్యార్థులు సైతం పరీక్ష రాయబోమనీ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు.. ఫీజు చెల్లించని 15 మంది విద్యార్థులకు పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తేనే తాము కూడా పరీక్షలు రాస్తామని విద్యార్థులు యాజమాన్యానికి అల్టిమేట్ జారీ చేశారు.

ఫీజు చెల్లించకుంటే విద్యార్థులను పరీక్షకు అనుమతించేది లేదని యాజమాన్యం తెగేసి చెప్పటంతో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. విద్యార్థుల ఆందోళన ఎక్కువ అవ్వటంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది నిజాం కాలేజ్ యాజమాన్యం. వెంటనే రంగంలోకి దిగారు అబిడ్స్ పోలీసులు. పోలీసులు విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..