
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థిని నిహారిక దొంతినేని భరతనాట్యం అరంగేట్రం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ సి.ఎచ్. విద్యాసాగరరావు ముఖ్య అతిధిగా హాజరు కాగా.. మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు అతిధిగా హాజరయ్యారు. బాల్యం నుంచే భరతనాట్యంపై ఆసక్తి కలిగిన నిహారికకు.. 9వ ఏట నుంచే ఆమె తల్లిదండ్రులు భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. అతిరధ మహారథుల సమక్షంలో జరుగుతున్న ఈ వేడుకను మీరు కూడా ఒకసారి తిలకించండి.