హైదరాబాదులో మరోసారి ఎన్ ఐ ఎ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న సానుభూతి పరుల వేటలో సౌత్ రాష్ట్రాలను టార్గెట్ చేసింది ఎన్ఐఏ.. మొత్తం 31 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఎన్ ఐ ఎ పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. తెలంగాణలోను ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, సైబారాబాద్ ప్రాంతాల్లో ఐదు చోట్ల తనిఖీలు నిర్వహించిన ఎన్‌ఐఎ పలువురు యువకులను అదుపులోకి తీసుకుంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాలిఫట్ ఐడియాలజీని ప్రమోట్ చేస్తున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది.
వీరంతా ఒక సమూహంగా ఏర్పడి ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నట్టు ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడింది. గత ఏడాది అక్టోబర్ 23న కోయంబత్తూరులో ఒక గుడికి సమీపంలో కార్ పేలుడు జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఎన్‌ఐఏ రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. మొత్తం 13 మందిని అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు రాబట్టింది. కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతో శనివారం ఉదయం తెలంగాణ తమిళనాడులో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పలువురు ఉగ్రవాద సానుభూతిపరులను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ సైబరాబాద్ ప్రాంతాల్లో ఐదుగురు ఉగ్రవాద సానుభూతిపరులను ఎన్ ఐ ఎ అదుపులోకి తీసుకుంది.. సోదాల్లో కీలక పత్రాలతో పాటు భారీగా నగదును స్వాధీనం చేసుకుంది. 60 లక్షల రూపాయల నగదు తో పాటు 18 వేల అమెరికన్ డాలర్లను ఎన్ ఐ ఎ స్వాధీనం చేసుకుంది..
అరబిక్ శిక్షణ పేరుతో ఐసిస్ కు మద్దతుగా స్థానిక యూత్‌ను ఆకర్షితులను చేసి ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. సోదాలు నిర్వహించిన సమయంలో స్వాధీనం చేసుకున్న నిందితుల మొబైల్ ఫోన్‌లని ఎన్‌ఐఏ పరిశీలిస్తుంది. మొబైల్ ఫోన్‌లో ఉన్న డేటా ద్వారా మరింత కీలక సమాచారం లభించే అవకాశం ఉంది. మరో వైపు ఈ ఉగ్రవాదులు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అయ్యేందుకు సోషియల్ మీడయా, వాట్సాప్, టెలిగ్రాంలను వాడుకున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. అయా సోషల్ మీడియా ఖతాలని కూడా ఎన్‌ఐఏ వెరిఫై చేస్తుంది. యూత్ ను ఇస్లాం వైపు ఆకర్షించే పనిలో బాగాoగానే అరబిక్ స్టడీ సెంటర్ల పేరుతో క్లాసులు ఏర్పాటు చేశారు.
వీటి గురించి సోషల్ మీడియాలోనూ విస్తారంగా ప్రచారం చేశారు.. మదర్స ముసుగు లో ఐసీస్ భావజాలాన్ని విస్తరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి 5 గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.. యూసఫ్ గూడ, రాజేంద్రనగర్, షేక్ పెట్ ,సైదాబాద్ నుంచి యువజులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీటితోపాటు కోయంబత్తూర్ లో 22 చోట్ల, చెన్నైలో మూడు ప్రాంతాల్లో, తమిళనాడులోని ఒక ప్రాంతంలో సోదాలు చేసి పలువురిని అదుపులోకి తీసుకుంది.. చెన్నై ఎన్‌ఐఏ అధికారులు వీరరందరిని అదుపులోకి తీసుకునీ విచారిస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..