Hyderabad: న్యూఇయర్‌ జోష్.. లెక్క తప్పితే ఊచలు లెక్కబెట్టాల్సిందే.. రూల్స్ బ్రేక్ చేస్తే డీజే మోతే..

త్త సంవత్సరం అంటే సెలబ్రేషన్స్‌ మామూలుగా ఉంటాయా.. ఒక రేంజ్‌లో ఉంటాయి... బుధవారం సాయంత్రం నుంచి మొదలయ్యే కొత్త సంవత్సరం పార్టీలు.. తెల్లవారేవరకే కాదు.. రేపు మొత్తం కూడా కంటిన్యూ అవుతాయ్‌..!. అందుకే, హైదరాబాద్‌లో పోలీస్‌ యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగుతోంది.

Hyderabad: న్యూఇయర్‌ జోష్.. లెక్క తప్పితే ఊచలు లెక్కబెట్టాల్సిందే.. రూల్స్ బ్రేక్ చేస్తే డీజే మోతే..
Hyderabad Police

Updated on: Dec 31, 2025 | 3:51 PM

న్యూఇయర్‌కి ఇంకా కొన్ని గంటలే మిగులుంది.. మరి, కొత్త సంవత్సరం అంటే సెలబ్రేషన్స్‌ మామూలుగా ఉంటాయా..! ఒక రేంజ్‌లో ఉంటాయి..!. ఈ సాయంత్రం నుంచి మొదలయ్యే కొత్త సంవత్సరం పార్టీలు.. తెల్లవారేవరకే కాదు రేపు కూడా కంటిన్యూ అవుతాయ్‌..!. అందుకే, హైదరాబాద్‌లో పోలీస్‌ యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగుతోంది. న్యూఇయర్‌ పార్టీల పేరుతో కంట్రోల్‌ తప్పేవాళ్లను కంట్రోల్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. మరి, న్యూఇయర్‌ పార్టీలు చేసుకునేవాళ్లకు పోలీసులు ఇస్తోన్న అలర్ట్స్‌ ఏంటి? వార్నింగ్స్‌ ఏంటి?

హైదరాబాదీలు ఇప్పటికే న్యూఇయర్‌ జోష్‌లోకి వెళ్లిపోయారు. 2026కి గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికేందుకు అన్నీ సెట్‌ చేసుకున్నారు. అయితే, కొత్త సంవత్సర వేడుకల్ని బాధ్యతాయుతంగా చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. పబ్స్‌, ఫాంహౌస్‌లు, రిసార్టులు, కన్వెన్షన్స్‌, గేటెడ్ కమ్యూనిటీలపై ఇప్పటికే నిఘా పెట్టారు. గంజాయి, డ్రగ్స్‌, మైనర్లకు అనుమతిస్తే.. యాక్షన్‌ సీరియస్‌గా ఉంటుందంటున్నారు. పక్కవాళ్లకు ఇబ్బంది కలుగకుండా సెలబ్రేషన్స్‌ చేసుకోవాలంటున్నారు పోలీసులు. లేదంటే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, పీకల్దాక తాగేసి స్టీరింగ్‌ పట్టుకుంటే మాత్రం యాక్షన్‌ సీరియస్‌గా ఉందంటున్నారు. డ్రైంకన్‌డ్రైవ్‌ చేస్తూ పట్టుబడితే.. లైసెన్స్‌ రద్దుతోపాటు.. జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇస్తున్నారు.

మరికొన్ని గంటల్లో సెలబ్రేషన్స్‌ మొదలుకానుండటంతో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల నిఘా ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకే సెలబ్రేషన్స్‌కు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో పబ్స్‌, ఫాంహౌస్‌లు, రిసార్టులపై ఈగల్‌ టీమ్‌ ఫోకస్‌ చేసింది..డీజే రూల్స్‌ ఉల్లంఘించినా చర్యలుంటాయని పోలీసులు ప్రకటించారు. ఈ రాత్రి 7 గంటల నుంచే డ్రంకన్‌డ్రైవ్‌ టెస్టులు జరగనున్నాయి.. డ్రంకన్‌డ్రైవ్‌ చేస్తే జైలుశిక్ష తప్పదంటూ పోలీసులు తెలిపారు. మహిళల భద్రత కోసం షీ-టీమ్స్‌, పోలీస్‌ పెట్రోలింగ్‌ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..