Hyderabad: కొంచమే తాగా.. మీ మిషనే తప్పు చూపిస్తోంది సార్.. లబలబ ఏడ్చిన మందుబాబు..
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో మందుబాబులు హల్‌చల్ చేశారు. డ్రంక్ అంగ్ డ్రైవ్ టెస్టులో అడ్డంగా బుక్కై నానా హంగామా చేశారు. కుల్సుంపురాలో డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన ఓ వ్యక్తి కొత్త సంవత్సరం సందర్బంగా కొద్దిగా తాగితే తప్పేంటని వాదనకు దిగాడు.

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో మందుబాబులు హల్‌చల్ చేశారు. డ్రంక్ అంగ్ డ్రైవ్ టెస్టులో అడ్డంగా బుక్కై నానా హంగామా చేశారు. కుల్సుంపురాలో డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన ఓ వ్యక్తి కొత్త సంవత్సరం సందర్బంగా కొద్దిగా తాగితే తప్పేంటని వాదనకు దిగాడు. అంతటితో ఆగకుండా బ్రీత్ ఎనలైజర్.. ఎక్కువ తాగినట్లుగా చూపిస్తుందంటూ పోలీసులతో గొడవ పెట్టుకున్నాడు.
కొత్త సంవత్సరం కాబట్టి కొద్దిగా తాగినానని.. బండి ఇప్పించాలంటూ ప్రాథేయపడ్డాడు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ బండి ఇప్పించండి మహాప్రభో అంటూ వేడుకున్నాడు.. పోలీసులు సర్థిచెప్పినా వినలేదు.. చివరకు డ్రెంకెన్ డ్రైవ్ చేసే బారీకేడ్ల వద్ద.. పోర్లుదండాలు పెట్టాడు.
వీడియో చూడండి..
చాలా సేపు అక్కడే ఉండి.. తన బైక్ ఇప్పించాలంటూ గోడకు తల బాదుకున్నాడు.. ఇంకా పోలీసుల కాళ్లు పట్టుకొని నానా హంగామా చేశాడు.. చివరకు పోలీసులు సర్థిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
నగరం అంతటా పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేశారు.. అయితే.. చాలా ప్రాంతాల్లో ఇలాంటి సీన్ లు తెరపైకి వచ్చినట్లు పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
