Hyderabad: న్యూ ఇయరే కానీ.. ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను

న్యూ ఇయర్‌కు గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పేందుకు హైదరాబాద్‌ రెడీ అవుతోంది. యూత్‌ను అట్రాక్ట్‌ చేసే కార్యక్రమా్లో ఈవెంట్‌ ఆర్గనైజేషన్స్‌ నిమగ్నమయ్యాయి. ఈ సారి ఈవెంట్‌ ఆర్గనైజర్సే కాదు.. పబ్లిక్‌ కూడా వారివారి ప్లాన్స్‌లో బిజీ అవుతున్నారు. ఫలితంగా.. హోటల్స్‌, రిసార్ట్స్‌, ఫామ్‌హౌస్‌లన్నీ హౌస్‌ఫుల్‌ బోర్డులు పెట్టేశాయి. అందుకు తగ్గట్లే హైదరాబాద్‌ పోలీసులు సైతం న్యూఇయర్‌ వేడుకల ఏర్పాట్లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టడం ఆసక్తిగా మారుతోంది.

Hyderabad: న్యూ ఇయరే కానీ.. ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
Hyderabad New Year

Updated on: Dec 19, 2025 | 7:05 AM

నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్‌ నగరం సిద్ధమవుతున్న వేళ పోలీసులు కూడా అదే రేంజ్‌లో దృష్టి సారిస్తున్నారు. ప్రత్యేకించి.. న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌కు కేరాఫ్‌గా నిలిచే హోటల్స్, రిసార్ట్స్‌, ఫామ్ హౌస్‌లపై డేగ కన్నేస్తున్నారు. న్యూ ఇయర్‌ వేడుకల అనుమతులకు సంబంధించిన రూల్స్‌ను కట్టుదిట్టం చేస్తున్నారు. హైదరాబాద్‌లో భారీగా పబ్స్‌ ఉండగా.. మాదాపూర్, గచ్చిబౌలిలోనే సుమారు 70కి పైగా పబ్స్‌తోపాటు.. కన్వెన్షన్ సెంటర్స్‌, గేటెడ్‌ కమ్యూనిటీలు కూడా ఎక్కువగానే ఉండడంతో వాటన్నింటిపై స్పెషల్‌ ఫోకస్‌ పెడుతున్నారు. ఈవెంట్స్ నిర్వాహకులు ఎల్లుండి నుంచి అనుమతులు తీసుకోవాలని.. గడువు ముగిశాక ఎలాంటి పర్మిషన్లు ఉండవని హైదరాబాద్‌ పోలీసులు ఓ సర్క్యులర్‌ కూడా జారీ చేశారు.

మాదాపూర్, గచ్చిబౌలిలోనే సుమారు 70కి పైగా పబ్స్‌

న్యూ ఇయర్‌ వేడుకలను ప్రతి ఒక్కరు బాధ్యతగా జరుపుకోవాలన్నారు మాదాపూర్ DCP రితిరాజ్‌. పబ్స్, కన్వెన్షన్ సెంటర్స్, గేటెడ్ కమ్యూనిటీ ఓనర్స్ తప్పకుండా అనుమతులు తీసుకోవాలని సూచించారు. పబ్స్‌లో మైనర్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలో చేయొద్దని ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించవద్దని, ఆర్గనైజర్లు డ్రగ్స్‌​కు అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే.. ఐటీ కారిడార్ పరిధిలోని ఈవెంట్ ఆర్గనైజర్లు, పోలీసులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆర్గనైజర్లు, ప్రజలు సహకరించాలని కోరారు. దీంతోపాటు.. ఈవెంట్లలో ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా పాటించాలని, కెపాసిటీకి మించి ప్రజలను అనుమతించవద్దని, డీజే పాటలతో సౌండ్ పొల్యూషన్ చేయవద్దని సూచించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విషయంలోనూ DCP రితిరాజ్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

మొయినాబాద్‌లో సుమారు 500కు పైగా ఫామ్ హౌస్‌లు

మరోవైపు.. సిటీ శివారులోనూ పోలీసులు డేగ కన్నేస్తున్నారు. మొయినాబాద్ డివిజన్‌లో సుమారు 500కు పైగా ఫామ్ హౌస్‌లు ఉండగా.. దాదాపు అన్నీ ఫుల్‌ అయిపోయాయి. ఈ క్రమంలోనే.. మొయినాబాద్ డివిజన్‌లోని ఫామ్ హౌస్ ఓనర్లతో రాజేంద్రనగర్ DCP యోగేష్ గౌతమ్‌ సమావేశం నిర్వహించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పాటించాల్సిన రూల్స్‌పై అవగాహన కల్పించారు. ఫామ్ హౌస్‌లలో లిక్కర్‌కు పర్మిషన్ లేకుండా పార్టీలు నిర్వహించినా.. డ్రగ్స్‌ వాడితే కఠిన చర్యలు తప్పవన్నారు. మొత్తంగా.. న్యూ ఇయర్‌ వేడుకలపై హైదరాబాద్‌ పోలీసులు ముందుగానే అలర్ట్‌ అవుతున్నారు. ప్రశాంత వాతావరణంలో న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..