అమ్మనా నేపాలీ … బోర్డర్ దాటితే అంతేనా..! నేపాల్ వాచ్‌మ్యాన్ కాపలా ఉంటున్నాడా..? అయితే తప్పక చదవండి..

| Edited By: శివలీల గోపి తుల్వా

Jul 20, 2023 | 11:12 AM

Hyderabad: చాలా మంది తమ ఇళ్ళలో నేపాలీలను వాచ్మెన్‌గా పెట్టుకుంటున్నారు. సంవత్సరాల తరబడి ఇంటికి కాపలా కాస్తున్న నేపాలీలే.. చివరికి అదే ఇంటికి కన్నం వేస్తున్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉండే ప్రజలు ఎక్కువగా నేపాలీ వాచ్ మెన్‌లను పెట్టుకుంటారు. ఎక్కువగా చోరీలు కూడా..

అమ్మనా నేపాలీ … బోర్డర్ దాటితే అంతేనా..! నేపాల్ వాచ్‌మ్యాన్ కాపలా ఉంటున్నాడా..? అయితే తప్పక చదవండి..
Cctv Footage And Accused Watchmen Gang
Follow us on

హైదరాబాద్, జూలై 20: చాలా మంది తమ ఇళ్ళలో నేపాలీలను వాచ్మెన్‌గా పెట్టుకుంటున్నారు. సంవత్సరాల తరబడి ఇంటికి కాపలా కాస్తున్న నేపాలీలే.. చివరికి అదే ఇంటికి కన్నం వేస్తున్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉండే ప్రజలు ఎక్కువగా నేపాలీ వాచ్ మెన్‌లను పెట్టుకుంటారు. ఎక్కువగా చోరీలు కూడా హైదరాబాద్‌లో చేస్తున్నారు నేపాలీ ముఠాలు. తాజాగా సికింద్రాబాద్‌లో ఐదు కోట్ల రూపాయల నగదు దోచుకెళ్ళారు నేపాల్ గ్యాంగ్. ఈ ముఠా సభ్యులను పట్టుకునేందుకు దాదాపు పది రోజులు సమయం పట్టింది పోలీసులకు.. హైదరాబాద్ నుండి మొదలుపెడితే పూనే, లక్నో మీదగా ఇండోనేపాల్ బార్డర్ వరకు వెళ్లిపోయారు నిందితులు.

బార్డర్ దాటితే అంతే సంగతులు..

హైదరాబాదులో కొట్టేసిన సొత్తు మొత్తం నేపాల్‌కు చేర్చడం వీరి లక్ష్యం. నేపాల్ కు వెళ్లేందుకు మార్గమధ్యలో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న తమ ముఠా సభ్యులను కలుస్తారు. అదే తరహాలో హైదరాబాదులో ఈ నెల 9న స్టీల్ వ్యాపారి విజయ్ గోపాల్ ఇంట్లో చోరీ చేశారు నిందితులు. బాధితులది ఉమ్మడి కుటుంబం కావటంతో ఇంట్లో భారీ ఎత్తున బంగారం నగదు ఉన్నాయని గ్రహించాడు నేపాలీ వాచ్మెన్ కమల్. కుటుంబ సభ్యులంతా మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ కి వెళ్లిన సందర్భాన్ని ఆసరాగా తీసుకొని ఇంట్లో 5 కోట్లకు విలువ చేసే నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. హైదరాబాదు నుండి కూకట్పల్లికి బస్సులో వెళ్లారు నిందితులు. అక్కడినుండి నేరుగా పూణే కి వెళ్లిపోయారు. అయితే నిందితులు బార్డర్ దాటి నేపాల్రీ వెళ్ళిపోతే ఎలాంటి ఉపయోగం వుండదని పోలీసులు ముందుగానే గ్రహించారు. దీoతో నిందితులు బార్డర్ దాటకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు.

హైదరాబాదులో చోరీ చేసిన తర్వాత నిందితులను పట్టుకునేందుకు వివిధ రాష్ట్రాలకు వెళ్లారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితులు బోర్డర్ దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇండో నేపాల్ బోర్డర్ లో విధులు నిర్వర్తించే సహస్ర సీమ భల్ కు సమాచారం అందించారు పోలీసులు. నిందితుల ఫోటోలతో పాటు వారు చోరీ లకు పాల్పడిన ఫుటేజ్ ను సైతం ssb కు షేర్ చేయడం తో సరిగ్గా బార్డర్ దాటే సమయంలో వారిని పట్టుకున్నారు పోలీసులు ..అక్కడి నుండి ట్రాన్సిట్ వారెంట్ మీదగా హైదరాబాద్ కి తరలించారు పోలీసులు.ఈ చోరీ కేస్ లో మొత్తం 42 లక్షల నగదు తో పాటు 5 కోట్లు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..