Hyderabad: నవాజ్‌ గ్యాంగ్‌ Vs ఇమ్రాన్‌ గ్యాంగ్‌.. జగద్గిరిగుట్టలో మారణాయుధాలతో హల్‌చల్‌.. చివరకు..

|

May 30, 2023 | 7:52 AM

హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలో నవాజ్‌ అండ్‌ ఇమ్రాన్‌ గ్యాంగ్‌లు మారణాయుధాలతో రహదారులపై తిరుగుతూ పరస్పరం దాడులకు యత్నిచింది. రెండు గ్యాంగ్‌లు ఆయుధాలతో రోడ్డుపైకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Hyderabad: నవాజ్‌ గ్యాంగ్‌ Vs ఇమ్రాన్‌ గ్యాంగ్‌.. జగద్గిరిగుట్టలో మారణాయుధాలతో హల్‌చల్‌.. చివరకు..
Hyderabad Crime News
Follow us on

హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలో నవాజ్‌ అండ్‌ ఇమ్రాన్‌ గ్యాంగ్‌లు మారణాయుధాలతో రహదారులపై తిరుగుతూ పరస్పరం దాడులకు యత్నిచింది. రెండు గ్యాంగ్‌లు ఆయుధాలతో రోడ్డుపైకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరస్పరం దాడులు చేసేందుకు యత్నించడంతో పోలీసులు ఎంటరై వారిని అరెస్ట్‌ చేశారు. 2021లో జగద్గిరిగుట్ట పీఎస్‌ పరిధిలో నవాజ్‌ అనే యువకుడిని ఇమ్రాన్‌గ్యాంగ్‌ హతమార్చింది. దాంతో ఇమ్రాన్‌ అండ్‌ గ్యాంగ్‌పై నవాజ్‌ సోదరుడు కక్షగట్టారు. నవాజ్‌ సోదరుడు అయాజ్‌, రోహిత్‌తో కలిసి ఇమ్రాన్‌ను కిడ్నాప్‌ చేశారు. ఈ పరిస్థితుల్లో ఒకరిపై మరొకరు దాడి చేసుకునేందుకు భారీగా మారణాయుధాలను కొనుగోలు చేశారు. జగద్గిరిగుట్ట ఏరియాలో కంట్రీమేడ్‌ పిస్టల్‌, బుల్లెట్స్‌, నకిలీగన్‌, కత్తులతో తిరుగుతున్న వారిని రింగ్‌బస్తీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నవాజ్‌ అనే యువకుడి హత్యకేసులో ఏ1 ఇమ్రాన్‌, ఏ2 ఖలీద్‌, ఏ3 శ్రీకాంత్‌లపై గతంలో పలు నేరాలకు పాల్పడిన చరిత్ర ఉంది. దాంతో ఇమ్రాన్‌, శ్రీకాంత్‌పై రౌడీషీట్‌ ఓపెన్ చేశారు పోలీసులు. ఏ1 ఇమ్రాన్‌ను కిడ్నాప్‌ చేసిన నవాజ్‌ సోదరుడు అయాజ్‌సింగ్‌, రోహిత్‌సింగ్, రోషన్‌సింగ్‌లు కూడా గతంలో పలు నేరాల్లో నిందితులని పోలీసులు తెలిపారు. రెండు గ్యాంగ్‌ల దగ్గర ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్న బాలానగర్‌ ఎస్‌వోటీ, జగద్గిరిగుట్ట పోలీసులు, ఐదుగురిని రిమాండ్‌కి తరలించారు. పరారీలో ఉన్న అయాజ్‌కోసం గాలిస్తున్నారు.

మొత్తానికి రెండు కరడుగట్టిన రెండు గ్యాంగ్‌ల పనిపట్టిన పోలీసులను బాలానగర్‌ ఏసీపీ అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..