లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి బుధవారం జానీని కస్టడీకి తీసుకున్న నార్సింగి పోలీసులు.. బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా ప్రశ్నించారు. ఇవాళ జానీతోపాటు అతని భార్య ఆయేషా అలియాస్ సుమలతతో కలిపి ఇంటరాగేట్ చేసే అవకాశం ఉంది.. ఈ మేరకు నోటీసులు ఇవ్వనున్నారు. న్యాయవాది సమక్షంలో నార్సింగి పోలీసులు ప్రశ్నించనున్నారు. శనివారం వరకు జానీని పోలీసులు ఇంటరాగేట్ చేయనున్నారు. ఆయనతోపాటు భార్య ఆయేషాను కూడా ప్రశ్నించి కేస్‌లో కీలక ఆధారాలు సేకరించనున్నారు.
లైంగికంగా వేధించి.. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడన్నది బాధితురాలి ఆరోపణ. హైదరాబాద్, ముంబైతోపాటు ఔట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు అత్యాచారం చేసేవాడని కంప్లైంట్‌లో పేర్కొంది. వేధింపులే కాదు.. జానీ, అతని భార్య కొట్టేవారని.. చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరించారంటోంది బాధితురాలు. వీటిన్నింటిపైనా జానీని ప్రశ్నించనున్నారు నార్సింగి పోలీసులు.
మైనర్‌గా ఉన్నప్పుటి నుంచే అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తోంది బాధితురాలు. షూటింగ్ సమయంలోనూ వ్యాన్‌లోకి తీసుకెళ్లి బలవంతం చేసేవాడని, ప్రతిఘటిస్తే కొట్టేవాడని అంటోంది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేసేవాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలపైనా జానీని ప్రశ్నించనున్నారు పోలీసులు.
కాగా.. కోర్టు మొత్తం నాలుగు రోజులపాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. జానీ మాస్టర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దంటూ న్యాయస్థానం సూచించింది. కాగా.. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..