స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం మాదే.. ఎంపీ కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న హామీల పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని ఎంపీ మల్లురవి అన్నారు. అన్ని వర్గాలకు లబ్ధి చేసే పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఈ ప్రభావంతో సర్పంచ్, లోకల్ బాడీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ మల్లురవి.అధికారం ఇకరాదనే ప్రస్టేషన్ లో కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు

స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం మాదే.. ఎంపీ కీలక వ్యాఖ్యలు
Mp Mallu Ravi

Edited By: Anand T

Updated on: Jul 22, 2025 | 10:07 AM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలపై మంచి స్పందన వస్తోందని, ఈ స్కీంలతో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని రానున్న స్థానిక సంస్థలు,GHMC ఎన్నికల్లో విజయం తమదే అని ధీమా వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్.. అన్ని వర్గాలకు లబ్ధి చేసే పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఈ ప్రభావంతో సర్పంచ్, లోకల్ బాడీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ మల్లురవి. అధికారం ఇకరాదనే ప్రస్టేషన్ లో కేటీఆర్ పిచ్చోడిలా కీమాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం అన్న విజ్ఞత వదిలి సీఎం రేవంత్ రెడ్డిపై స్థాయికి మించిన విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు మల్లు రవి. సీఎంపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్టానం పరిశీలిస్తోందన్నారు. సీఎం ఏ సందర్భంగా ఆ కామెంట్స్ చేసారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలియదన్నారు. అయితే… వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే అభిప్రాయాలు అధిష్టానం ముందు చెప్పాలని, అంతేకానీ బహిరంగంగా మాట్లాడటం పార్టీకి మంచిది కాదని హితవు పలికారు. ఇకపై కాంగ్రెస్ నేతలు సంయమనంతో మాట్లాడాలని పార్టీ నేతలకు సూచించారు.

బిసి రిజర్వేషన్లు,కులగణన పై ఇందిరా భవన్ లో సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,ఇతర మంత్రి వర్గం జులై 24- 25 న ఢిల్లీ లో పర్యటించనున్నారు. లోక్ సభ, రాజ్య సభ ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను కలిసి బీసీ 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని వివరించనున్నారు. ఈ నెల 24 సాయంత్రం ఇందిరా భవన్ లో 100 కాంగ్రెస్ ఎంపీలకు 42 శాతం బిసి రిజర్వేషన్ల అంశంపై సీఎం స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారన్నారు. ప్రధాని మోడి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని ఆపరేషన్ సింధుర్ పై సభలో ప్రధాని సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తుంటే. ప్రధాని రెండే నిమిషాలు హౌస్ లో ఉండి వెళ్లిపోవడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని, సభను వాయిదా వేయడంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజల తరపున తాము రాజ్యాంగ బద్ధమైన డిమాండే చేస్తున్నామని, 140 కోట్ల ప్రజల గొంతును పార్లమెంట్ లో లేవనెత్తుతున్నామన్నారు ఎంపీ మల్లు రవి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.