AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆ అమ్మాయికి, ఆత్మీయ బంధాలకు దూరమయ్యా.. చనిపోయే ముందు విద్యార్థి ఏం చెప్పాడంటే..

ఓ వైపు భవిష్యత్తు.. మరోవైపు ఆత్మీయ ప్రేమ బంధాలకు దూరమయ్యాయనే ఆవేదన.. ప్రేమించిన యువతి మరొకరితో వివాహం చేసుకోవడం.. ఆ యువకుడిని తీవ్ర సంఘర్షణకు గురిచేసింది.. తన అనుకున్న వాళ్లంతా తనకు కాకుండా పోతున్నారని మనో వేదనకు గురయ్యాడు. చివరకు బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు..

Hyderabad: ఆ అమ్మాయికి, ఆత్మీయ బంధాలకు దూరమయ్యా.. చనిపోయే ముందు విద్యార్థి ఏం చెప్పాడంటే..
Hyderabad Crime News
P Shivteja
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jul 22, 2025 | 12:21 PM

Share

ఓ వైపు భవిష్యత్తు.. మరోవైపు ఆత్మీయ ప్రేమ బంధాలకు దూరమయ్యాయనే ఆవేదన.. ప్రేమించిన యువతి మరొకరితో వివాహం చేసుకోవడం.. ఆ యువకుడిని తీవ్ర సంఘర్షణకు గురిచేసింది.. తన అనుకున్న వాళ్లంతా తనకు కాకుండా పోతున్నారని మనో వేదనకు గురయ్యాడు. చివరకు బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు.. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని వోక్సెన్​యూనివర్సిటీ (Woxsen University) లో జరిగింది.. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

పూర్తి వివరాల ప్రకారం..

హైదరాబాద్ సరూర్​నగర్‌కు చెందిన రుషికేష్​(19) వోక్సెన్​యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్​రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడి తల్లిదండ్రులు ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారు. వారు విడాకులు తీసుకున్నారు. దీంతో అక్కతో కలిసి రుషికేష్​తల్లి వద్దే ఉంటున్నాడు. తల్లిదండ్రులిద్దరినీ కలపాలని చాలా ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు..ఈ క్రమంలోనే తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో వివాహమైంది. ఈ పరిణామాలు అతడిని మానసికంగా కుంగదీశాయి.

వీటికి తోడు ఇటీవల రుషికేష్​తన స్నేహితులతో కలిసి కొండపోచమ్మ సాగర్, తదితర ప్రాంతాలకు వెళ్లారు. ఇందుకోసం ఒక కారును అద్దెకు తీసుకున్నారు.. వారే స్వయంగా నడుపుకుంటూ వెళ్లారు. వచ్చే క్రమంలో కారు యాక్సిడెంట్‌కు గురయ్యింది. రిపేర్​ చేయించేందుకు డబ్బులు ఇవ్వాలని యజమాని ఒత్తిడి చేశాడు. కుటుంబంలోనూ ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో సర్దలేకపోయాడు.. ఇలా ఒకదానికి వెనక అనేక సమస్యలు వచ్చిపడటంతో రుషికేష్​తట్టుకోలేకపోయాడు.

ఈ క్రమంలో.. ఆదివారం రాత్రి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వినిపించాడు.. ఆ తర్వాత క్యాంపస్‌లోని తన గదిలో ఉరివేసుకొని చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..