
వర్షాకాలంలో పాములు తరచూ ఇంటి పరిసరాల్లోకి వస్తుంటాయి. ఇలా వచ్చిన పాములు కొన్ని సందర్భాల్లో మనం బయటపెట్టే షూలలో కూడా దూరుతూ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ అలాంటి ఘటనే వెలుగు చూసింది. ఒక పాములు ఇంటి పరిసరాల్లో నిలిపిన స్కూటీలోకి దూరింది. ఆగ మనించని వాహనదారుడు దాన్ని తీసుకొని అలానే వెళ్లి పోయాడు. మార్గం మధ్యలో స్కూలోంచి పాము బయటకు రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే వాహనాన్ని పక్కకు ఆపి దూరంగా పరిగెత్తాడు. ఈ వింత ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. అంబర్పేట పటేల్ నగర్‌లో నివాసం ఉండే ఓ వ్యక్తి ఉదయం సమయంలో ఆజాద్ నగర్ మీదుగా అలీ కేఫ్ చౌరస్తా వైపు వెళ్తున్నాడు. ఆజాద్ నగర్ మదర్సా వద్దకు రాగానే అతని ద్విచక్ర వాహనంలో అంతవరకు ఉన్న నాగుపాము పిల్ల అకస్మాత్తుగా అతని చేతి మీదికి ఎక్కింది. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన అతనకు వెంటనే తన చేతిపై ఉన్న నాగుపామును విసిరి కొట్టగా అది కింద పడింది. దీంతో ఆందోళనకు గురైన వాహనదారుడు వెంటనే వాహనాన్ని పక్కకు ఆపి దానిపై నుంచి కిందికి దిగాడు.
అయితే క్రింద పడిపోయిన నాగుపాము మళ్లీ అతని స్కూటీలోకి దూరింది. దాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ సంఘటనా స్థలానికి చేరుకొని దాదాపు రెండు గంటలపాటు వాహన భాగాలన్నింటిని విప్పగా పాము లోపల దూరి ఉండడం గమనించి బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను నడిపేటప్పుడు తమ వాహనాలలో ఏమైనా పాములు తదితర జంతువులు ఉన్నాయా చూసుకోవాలని స్నేక్ క్యాచర్ సూచించాడు. అయితే వాహనదారుడిని పాము కాటువేయకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.