Hyderabad: పగలు ఎండ.. సాయంత్రానికి వాన.. వెరైటీ వెదర్ తో హైదరాబాద్ వాసులు షాక్

|

May 16, 2022 | 6:59 AM

హైదరాబాద్(Hyderabad) మహానగరంలో ఆదివారం భిన్న వాతావరణం కనిపించింది. పగలు సూర్యుడి సెగలతో అల్లాడిన ప్రజలను సాయంత్రానికి వాన పలకరించింది. సిటీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం...

Hyderabad: పగలు ఎండ.. సాయంత్రానికి వాన.. వెరైటీ వెదర్ తో హైదరాబాద్ వాసులు షాక్
Hyderabad Rains
Follow us on

హైదరాబాద్(Hyderabad) మహానగరంలో ఆదివారం భిన్న వాతావరణం కనిపించింది. పగలు సూర్యుడి సెగలతో అల్లాడిన ప్రజలను సాయంత్రానికి వాన పలకరించింది. సిటీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసింది. వాన కురవడం కంటే ముందు గాలివాన బీభత్సం సృష్టించింది. తీగలు తెగిపడటంతో విద్యుత్ సరఫరాకు అవాంతరాలు ఏర్పడ్డాయి. పాతబస్తీ కుర్మగూడలో ఓవర్‌లోడ్‌తో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ పేలింది. దీంతో అక్కడే ఉన్న మూడు వాహనాలు మంటల్లో కాలిపోయాయి. యూసుఫ్ గూడలో కొద్దిపాటి వానకే రహదారులు జలమయం అయ్యాయి. వాననీరు వరదై బస్తీని ముంచెత్తుతోంది. ఆదివారం సైతం అడుగు లోతులతో దారులన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్‌లో(Jubilee Hills) అత్యధికంగా 12.5 మి.మీ. వాన పడింది. గచ్చిబౌలిలో 8.5, ఖైరతాబాద్‌లో 8.3, మాదాపూర్‌లో 8.3, మూసాపేటలో 4.0 మి.మీ. వర్షం కురిసింది. అడ్డగుట్టలో 40.5 డిగ్రీలు, ఉప్పల్‌లో 40.4, మాదాపూర్‌లో 40.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండం వల్ల రెండు రాష్ట్రాల్లో వర్షాలు ఇంకా పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 19 వరకూ ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని, నేడు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. రాయలసీమలోనూ నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

Voter Id: గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం.. త్వరలో కొత్త నిబంధనలు.. ఏంటంటే..

Health Tips: ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందాలంటే డైట్‌లో ఇవి ఉండాల్సిందే..!