Minister KTR: ‘అంతకు అంత అనుభవిస్తారు’.. గువ్వల బాలరాజును పరామర్శించిన మంత్రి కేటీఆర్..

అచ్చంపేటలో అర్ధరాత్రి జరిగిన రాళ్లదాడిలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ ధైర్యం చెప్పారు. తెలంగాణలో దాడుల సంస్కృతి మంచిది కాదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. అచ్చంపేటలో దాడిని ఖండిస్తున్నామన్నారు.

Minister KTR: ‘అంతకు అంత అనుభవిస్తారు’.. గువ్వల బాలరాజును పరామర్శించిన మంత్రి కేటీఆర్..
Minister Ktr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 12, 2023 | 1:57 PM

అచ్చంపేటలో అర్ధరాత్రి జరిగిన రాళ్లదాడిలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ ధైర్యం చెప్పారు. తెలంగాణలో దాడుల సంస్కృతి మంచిది కాదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. అచ్చంపేటలో దాడిని ఖండిస్తున్నామన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. అంతకు అంత అనుభవిస్తారంటూ హెచ్చరించారు. గువ్వలకు భద్రత పెంచాలని.. కేటీఆర్ డీజీపికి విజ్ఞప్తి చేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఘర్షణల నేపథ్యంలో అచ్చంపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీడియో ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్య నిన్న రాత్రి గొడవ జరిగింది. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు. దాడిలో గువ్వల బాలరాజు గాయపడటంతో హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గువ్వల బాలరాజు ఆరోగ్యం నిలకడగా ఉందని ..ఆయన సతీమణి అమల తెలిపారు. సాయంత్రం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు.

మరోవైపు అచ్చంపేటలో హైటెన్షన్ నెలకొంది.. తమ నాయకుడిపై దాడిని ఖండించారు స్థానిక బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ వాళ్లు కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. తాము దాడులకు దిగితే.. కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చెయ్యలేరని హెచ్చరిస్తున్నారు.

కేటీఆర్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..