Shaikpet Flyover: హైదరాబాదీలకు తెలంగాణ సర్కార్ న్యూ ఇయర్ కానుక.. రేపటి నుంచి అందుబాటులోకి ఆరు లైన్ల ప్లై ఓవర్..

|

Dec 31, 2021 | 5:32 PM

హైదరాబాద్‌ మహానగరం సిగ మరో మణిహారం చేరనుంది. న్యూ ఇయర్ కానుకగా అతిపొడవైన ఆరు లైన్ల షేక్ పేట్ ప్లై ఓవర్ ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. శనివారం ఉదయం 11 గంటలకు రిబ్బన్ కట్ చేసి ప్లైఓవర్ ను ప్రారంభిస్తారు..

Shaikpet Flyover: హైదరాబాదీలకు తెలంగాణ సర్కార్ న్యూ ఇయర్ కానుక.. రేపటి నుంచి అందుబాటులోకి ఆరు లైన్ల ప్లై ఓవర్..
Shaikpet Flyover
Follow us on

Hyderabad Shaikpet Flyover: హైదరాబాద్‌ మహానగరం సిగ మరో మణిహారం చేరనుంది. న్యూ ఇయర్ కానుకగా అతిపొడవైన ఆరు లైన్ల షేక్ పేట్ ప్లై ఓవర్ ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. శనివారం ఉదయం 11 గంటలకు రిబ్బన్ కట్ చేసి ప్లైఓవర్ ను ప్రారంభిస్తారు మంత్రి కేటీఆర్. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి, ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులకు, ఐటీ ఉద్యోగులకు దీంతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మరికొన్ని గంటల్లో ప్రారంభోత్సవానికి సిద్దమైన ప్లైఓవర్‌కు చాలా ప్రత్యేకతలన్నాయి.

షేక్ పేట్ ఫ్లై ఓవర్ ప్రత్యేకతలు..

రేతిబౌలి నుంచి ఆరులేన్లతో షేక్‌ పేట్‌ , ఫిలింనగర్‌ జంక్షన్‌ ఓయూ కాలనీ, విస్పర్‌ వ్యాలీ జంక్షన్‌ వరకు నిర్మించిన షేక్‌పేట్‌ ఫ్లై ఓవర్‌ ఇంటర్మిడియట్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణం నగరంలో రెండవ అతి పెద్దదిగా నిలవనున్నది. పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే తర్వాత 2.8 కిలోమీటర్ల పొడవులో ఈ నిర్మాణం చేపట్టారు. ఈ ఫ్లై ఓవర్‌తో హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, గచ్చిబౌలి వెళ్లే వాహనదారులకు మహా ఉపశమనం లభించనున్నది. నిర్మాణంలో భాగంగా 74 పిల్లర్స్‌, 72 పియర్‌ క్యాప్స్‌, 440 పి.ఎస్‌.సి గడ్డర్స్‌,144 కాంపోసిట్‌ గ్రీడర్స్‌ ఏర్పాటు చేశారు.

ఈ ఫ్లై ఓవర్ వినియోగంలోకి వస్తే ఆయా మార్గాల్లో ప్రయాణించేవారికి ట్రాఫిక్‌ చిక్కులు తగ్గడంతోపాటు తద్వారా ఇంధన వ్యయం, ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది.  మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులకు ఎక్కడా సిగ్నల్స్‌ లేకుండా గమ్యస్థానాలకు చేరేలా ఈ ఫ్లైఓవర్‌ ఎంతో ఉపయోగపడనుంది.

ఏదేమైనప్పటికీ.. గ్రేటర్‌ హైదరాబాద్‌‌లో వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్లు నగర రూపురేఖల్నే మార్చివేశాయి. ముఖ్యంగా ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం) కింద చేపట్టిన పనులు ఎలాంటి నిధుల కొరత లేకుండా జరగడమే అందుకు కారణం.

ఇవి కూడా చదవండి: Tadikonda MLA Sridevi: మాదిగలకు హక్కులు ఆయన వల్లే రాలేదు.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి

Green Coriander Benefits: పచ్చి కొత్తిమీరను తినేవారు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే.. ఏంటంటే..