Minister KTR: గుండె కరిగిపోయింది.. వీధి కుక్కల నుంచి శాశ్వత విముక్తి కలిగించాలి.. మంత్రి కేటీఆర్

Minister KTR on stray dogs: హైదాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల వీధి కుక్కల దాడులు పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల కుక్కల దాడులలో ప్రాణాలు పొగా.. మరికొన్ని చోట్ల చాలామంది గాయాలపాలవుతున్నారు.

Minister KTR: గుండె కరిగిపోయింది.. వీధి కుక్కల నుంచి శాశ్వత విముక్తి కలిగించాలి.. మంత్రి కేటీఆర్
Minister Ktr

Updated on: Jun 10, 2023 | 3:25 PM

Minister KTR on stray dogs: హైదాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల వీధి కుక్కల దాడులు పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల కుక్కల దాడులలో ప్రాణాలు పొగా.. మరికొన్ని చోట్ల చాలామంది గాయాలపాలవుతున్నారు. రోజూ ఎక్కడో ఒకచోట వీధి కుక్కల దాడుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వీధి కుక్కల దాడుల ఘటనలపై మంత్రి కేటీఆర్‌ శనివారం ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో జరిగిన మున్సిపల్‌ వార్డ్‌ ఆఫీసర్స్‌ ఓరియంటేషన్‌ కార్యక్రమంలో వీధి కుక్కల దాడులను అరికట్టడంపై మంత్రి కేటీఆర్‌ పలు కీలక సూచనలు చేశారు. వీధి కుక్కల బాధ నుంచి హైదరాబాద్‌కు శాశ్వత విముక్తి కలిగించాలన్నారు. ఎమ్మెల్యేలతోపాటు GHMCకి మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక సూచన చేశారు. ఇటీవల కుక్కల దాడిలో బాలుడు చనిపోవడం చూస్తే గుండె కరిగిపోయిందని.. మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. మన పిల్లలకు జరిగితే ఎలా స్పందిస్తామో అలాగే చేయాలని కేటీఆర్‌ తెలిపారు.

కుక్కల దాడి నుంచి పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనే ఉందని కేటీఆర్ స్పష్టంచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక ఫోకస్‌ పెట్టి చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లితే కుక్క కరవొద్దు.. పిల్లలను వీధి కుక్కలు కరిస్తే అది మనకే అవమానకరం అంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటానికి లేదంటూ కేటీఆర్‌ అందరికీ సూచించారు. వీధి కుక్కల దాడుల నుంచి విముక్తి కలిగించాలంటూ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

కరోనా సమయంలో GHMC ఇంజినీరింగ్‌ సిబ్బంది చేసిన పని చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి KTR అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెలంగాణ సుపరిపాలన దినోత్సవంలో మున్సిపల్‌ శాఖ మంత్రి KTR పాల్గొని మాట్లాడారు. రోడ్ల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఎంత మంది సఫాయి కార్మికులున్నా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..