మొబిలిటీ రంగంలో తెలంగాణ లో మంచి అవకశాలు ఉన్నాయని, ఆటోమోటివ్ సేఫ్టీ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని బాస్క్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ లీడర్ షిప్ టీమ్ మెంబర్ ఆర్కే శినోయ్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న ఈ మొబిలిటీ సమ్మిట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు వేల మందికి ఉపాధి కలిగించేలా రాష్ట్రంలో AI అండ్ సేఫ్టీ సొల్యూషన్ ఆటోమోటివ్ ప్లాంట్ నెలకొల్పుతామని వెల్లడించారు. 2030 నాటికి 90 శాతం వాహనాలు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ తో నడుస్తాయి కనుక వాటి సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యమని అన్నారు శినోయ్. తమ బృందం అందుకు తగిన జాగ్రతలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఐటీ శాఖ సెక్రటరీ జయేష్ రంజన్ హాజరయ్యారు.
ఇండియాలోనే మొదటి మొబిలిటీ వ్యాలీ తెలంగాణలోనే ఏర్పాటుకానున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఈవీ మ్యానిఫ్యాక్చర్ క్లస్టర్స్ ఉన్నాయన్నారు. మోమిన్‌పేట్ లో తెలంగాణ ఈ-మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలోనే మరో 4 మొబిలిటీ క్లస్టర్స్ ఏర్పాటు ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే అమర్ రాజా గ్రూప్, హ్యుందాయ్ వంటి చాలా కంపెనీస్ తెలంగాణలో యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా 6బిలియన్ల పెట్టుబడి, నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కాగా కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వంతో పలు కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి.
We had the honour to host Hon. Minister @KTRBRS at our office in Hyderabad. His fireside chat with Uber employees was one for the books where he delved into sustainable and future forward transportation in Hyderabad. pic.twitter.com/nB6w4fScD3
— Uber India (@Uber_India) February 6, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..