ఢిల్లీకి రాజైన కన్నోళ్లకు కొడుకే.. ఎండలో తండ్రికి గొడుగు పట్టిన మంత్రి జగదీష్ రెడ్డి

|

Apr 11, 2023 | 5:39 PM

ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్లుగా... నాన్నకు ప్రేమతో.. తండ్రికి గొడుగు పట్టాడు మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రిగా బిజీ షెడ్యూల్‌తో ఉండే జి జగదీష్ రెడ్డి తండ్రితో కలిసి తమ స్వగ్రామం నాగారంలోని తమ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు..

ఢిల్లీకి రాజైన కన్నోళ్లకు కొడుకే.. ఎండలో తండ్రికి గొడుగు పట్టిన మంత్రి జగదీష్ రెడ్డి
Minister G Jagadish Reddy
Follow us on

ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్లుగా… నాన్నకు ప్రేమతో.. తండ్రికి గొడుగు పట్టాడు మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రిగా బిజీ షెడ్యూల్‌తో ఉండే జి జగదీష్ రెడ్డి తండ్రితో కలిసి తమ స్వగ్రామం నాగారంలోని తమ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. వారు వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతున్న క్రమంలో ఎండ వేడిమి అధికమవడంతో ఇబ్బంది పడుతున్న తండ్రికి మంత్రి జగదీష్ రెడ్డి గొడుగు పట్టి వెంట నడిచారు.

మంత్రి హోదాను పక్కన పెట్టి కొడుకుగా తండ్రికి గొడుగు పట్టి సమాజానికి తల్లిదండ్రులపై సంతానం బాధ్యతను గుర్తు చేశారు. మంత్రి హోదా దర్పం లేకుండా కొడుకుగా తండ్రికి గొడుగు పట్టి సాగిన జగదీష్ రెడ్డిని చూసిన స్థానికులు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. మండుటెండలో తను సాగుతూ తండ్రికి నీడగా గొడుగు పట్టి కొడుకుగా మంత్రి చూపిన బాధ్యతకు సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.