AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: “మహిళలకు కానుకగా చీరలు ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది”.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కామెంట్స్..

బతుకమ్మ పండుగ సందర్భంగా.. మహిళలకు చిరు కానుకగా బతుకమ్మ చీరలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత..

Telangana: మహిళలకు కానుకగా చీరలు ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కామెంట్స్..
Errabelli Dayakar
Ganesh Mudavath
|

Updated on: Sep 24, 2022 | 10:14 AM

Share

బతుకమ్మ పండుగ సందర్భంగా.. మహిళలకు చిరు కానుకగా బతుకమ్మ చీరలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, ఘనంగా జరుపుకుంటున్నామని వివరించారు. ఏటా కోటి బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం 24 విభిన్న డిజైన్లు 10 రకాల ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ చీరలు తయారయ్యాయని మంత్రి చెప్పారు. బతుకమ్మ చీరల ప్రాజెక్టు కొరకు మొత్తం రూ. 339.73 కోట్ల ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్న జీవితాల్లో వెలుగులు నింపామని, వారికి చేతి నిండా పని కల్పించామని చెప్పారు. ఈ మేరకు బతుకమ్మ చీరల తయారీపై ఏర్పాటు చేసిన డాక్యుమెంటరీని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీక్షించారు. కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక ఇవ్వడం పట్ల కేసీఆర్, కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో బతుకమ్మ చీరలపై డాక్యుమెంటరీ రూపొందించినట్లు జనగామ జిల్లా కు చెందిన కడవెండి సోమేష్ తెలిపారు.

బతుకమ్మ చీరల విలువ చూడకూడదు. వాటి వెనుకు సీఎం కేసీఆర్ ప్రేమను మాత్రమే చూడాలి. కొంతమంది కావాలనే బతుకమ్మ చీరలను కాల్చాలని చూస్తున్నారు. ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. చీరలు నచ్చకపోతే వాపస్ ఇచ్చేయండి. కానీ కాల్చవద్దు. ఎంత విలువ అనేది ముఖ్యం కాదు. కావాలని కొంత మంది ఇలాంటి మూర్ఖపు పనులు చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా పండుగకు చీరలు ఇస్తున్నాం. దీని వల్ల ఎంతో మంది చేనేత కార్మికులకు పని దొరుకుతుంది.

– ఎర్రబెల్లి దయాకర్ రావు, తెలంగాణ మంత్రి

ఇవి కూడా చదవండి

మరోవైపు.. తెలంగాణలో ఈ నెల 22 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఏడాది సూమారు కోటి బతుకమ్మ చీరలు పంపీణి చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.6 మీట్లర్ల పొడవు ఉండేలా చీరలను తయారుచేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళలు ధరించే 9 మీటర్లు పొడవు గల చీరలు 8 లక్షలు తయారుచేయించారు. మొత్తం కోటి బతుకమ్మ చీరలను ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ అందిచనున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సూమారు 5.8 కోట్ల చీరలను పంపిణీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..