Hyderabad: మేం దావత్ చేసుకోవాలే.. మీరు ఇళ్లకు పోండి.. స్టూడెంట్స్ కి షాకిచ్చిన 80 మంది టీచర్లు.. కట్‌చేస్తే

|

Dec 18, 2024 | 10:23 AM

స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన 80 మంది ఉపాధ్యాయులు దావత్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం ఏకంగా స్కూల్‌నే మూసేసి విద్యార్థుల్ని ఇళ్లకు పంపించేశారు. ఉదయం స్కూల్‌కి వచ్చిన పిల్లల్ని మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించి ఇళ్లకు పంపించేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విషయం జిల్లా కలెక్టర్‌కి చేరింది.

Hyderabad: మేం దావత్ చేసుకోవాలే.. మీరు ఇళ్లకు పోండి.. స్టూడెంట్స్ కి షాకిచ్చిన 80 మంది టీచర్లు.. కట్‌చేస్తే
Teachers For Closing School
Follow us on

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ది చేసి, నాణ్యమైన విద్యను అందించాలని సర్కార్‌ యోచిస్తోంది. కానీ, సంబంధిత అధికారులు, సిబ్బంది మాత్రం అడుగు ముందుకు పడకుండా చేస్తున్నారు. గవర్నమెంట్‌ సూల్స్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలకు మరింత బలాన్నిచ్చేలా కొందరు ప్రభుత్వ పాఠశాల సిబ్బంది ప్రవర్తిస్తున్నారు. కానీ, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు. తాజాగా హైదరాబాద్‌ జిల్లాలోని షేక్‌పేట్‌ మండల పరిధిలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.

హైదరాబాద్‌ జిల్లా షేక్‌పేట్‌ మండల పరిధిలోని 20 ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు చేసిన పని సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఈ 20స్కూళ్లకు సంబంధించిన దాదాపు 80 మంది ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ వేటు పడింది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో 80 మంది ఉపాధ్యాయులు దావత్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం ఏకంగా స్కూల్‌నే మూసేసి విద్యార్థుల్ని ఇళ్లకు పంపించేశారు. ఉదయం స్కూల్‌కి వచ్చిన పిల్లల్ని మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించి ఇళ్లకు పంపించేశారు. టీచర్లంతా మస్త్‌గా దావత్‌కు హాజరై భోజనాలు ఆరగించారు. దీనిపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసి కంగుతిన్నారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విషయం జిల్లా కలెక్టర్‌కి చేరింది. ఘటనపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి విచారణ చేపట్టి బాధ్యులైన డీఐఓఎస్‌ యాదగిరిని సస్పెండ్‌ చేశారు. విందులో పాల్గొన్న మిగతా టీచర్లందరికీ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన డిసెంబర్‌ 13న జరిగినట్టుగా తెలిసింది. విధులు నిర్వహిస్తున్న 80 మంది సెకెండ్‌ గ్రేడ్‌ టీచర్లు, ప్రధానోపాధ్యాయులతోపాటు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌(డీఐఓఎస్‌) యాదగిరి కలిసి దావత్‌ చేసుకునేందుకు బంజారాహిల్స్‌లోని ప్రభుత్వ పాఠశాలను వేధిక చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో విద్యార్థులను మధ్యాహ్న భోజనం అనంతరం ఇళ్లకు పంపించేశారు. అనంతరం బడులకు తాళాలు వేసి బంజారాహిల్స్‌లోని పాఠశాలకు చేరుకొని విందు భోజనం చేశారు. మధ్యాహ్నమే పిల్లలంతా ఇళ్లకు రావడంతో అనుమానం వచ్చిన కొందరు తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీయగా విషయం తెలిసింది. కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తీవ్రంగా పరిగణించి డీఐఓఎస్‌ను సస్పెండ్‌ చేయడంతోపాటు ఉపాధ్యాయులకు తాఖీదులు జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి