Telangana: భారీగా డీఎస్సీ పోస్టులు.. ఇక నిరుద్యోగులకు పండగే.! కొత్త నిబంధనలివే..

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయింది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విడుదల చేశారు. వీటిల్లో గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులు కూడా ఉన్నాయి.

Telangana: భారీగా డీఎస్సీ పోస్టులు.. ఇక నిరుద్యోగులకు పండగే.! కొత్త నిబంధనలివే..
Dsc Posts

Edited By: Ravi Kiran

Updated on: Feb 29, 2024 | 6:00 PM

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయింది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విడుదల చేశారు. వీటిల్లో గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా 4,957 టీచర్‌ పోస్టులు, మరో 1, 016 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు కలిపి మొత్తం 11, 062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. మొత్తం పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629 పోస్టులు, భాషా పండితులు 727 పోస్టులు, పీఈటీలు 182 పోస్టులు, ఎస్జీటీలు 6,508 పోస్టులు, స్పెషల్‌ కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి.

గత డీఎస్సీకి 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. గత దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు తాజాగా మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మే లేదా జూన్ నెలలో డీఎస్సీ రాత పరీక్షలను కంప్యూటర్‌బేస్డ్‌ టెస్ట్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్‌ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించనున్నారు

వచ్చే నెల 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచిన నేపథ్యంలో 46 ఏళ్ల వయస్సు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. పరీక్షల తేదీలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. త్వరలో తెలియజేస్తామని ప్రకటించింది. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు

ఇవి కూడా చదవండి

అయితే టెట్ తర్వాతే టీచర్ పోస్టులు పెంచి మెగా డీయస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థుల డిమాండ్ చేశారు. డిఎడ్, బీఎడ్ అభ్యర్థులు 2 లక్షల మంది టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాల నీ కోరుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వేస్తున్న డీయస్సీ నోటిఫికేషన్ లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కూడా 6వేలకు పెంచి ఎస్జీటీ అవకాశం బీఎడ్ అభ్యర్థులకు లేనందున బీఈడీ అభ్యర్థులకు పోస్టులు పెంచి ప్రభుత్వం న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది చదవండి: మండుటెండల్లో సిమ్లాలాంటి చల్లదనం.. కూలర్ కంటే చౌకైన ధర.. ఈఎంఐ ఆప్షన్ కూడా