Medical Negligence: సమయానికి వైద్యం అందక నిండు గర్బిణి మృతి.. 5 ఆసుపత్రులు తిరిగిన దక్కని ప్రాణం..!

|

May 15, 2021 | 12:33 PM

వైద్యసిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు గర్భిణి మృతికి కారణమైంది. కడుపులో మోసిన కన్నబిడ్డను కల్లారా చూసుకోకుండానే బాలింత ప్రాణాలు వదిలింది. ఈ విషాద సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది

Medical Negligence: సమయానికి వైద్యం అందక నిండు గర్బిణి మృతి.. 5 ఆసుపత్రులు తిరిగిన దక్కని ప్రాణం..!
Pregnant Woman Dies At Hospital In Hyderabad
Follow us on

Medical Negligence: వైద్యసిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు గర్భిణి మృతికి కారణమైంది. కడుపులో మోసిన కన్నబిడ్డను కల్లారా చూసుకోకుండానే బాలింత ప్రాణాలు వదిలింది. ఈ విషాద సంఘటన హైదరాబాద్ మహానగరంలోని నాచారం పరిధిలోని మల్లాపూర్‌లో వెలుగుచూసింది. సరియైన వైద్యం అందకపోవడంతోనే మహిళ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు వాపోతున్నారు.

నాచారంలోని మల్లాపూర్ ప్రాంతానికి చెందిన పావనితో ఏలూరుకు చెందిన శ్రీనివాస్ గతేడాది ఆగస్టులో వివాహం జరిగింది. గర్భవతి కావడంతో ఇటీవల మల్లాపూర్‌లోని పుట్టింటికి వచ్చింది పావని. ఎనిమిది నెలలుగా ఆమె తల్లిదండ్రలు.. నాచారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో పావనిని రెగ్యూలర్‌గా చికిత్స అందిస్తున్న ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆమె తల్లిదండ్రులు.

పావనిని పరిశీలించిన వైద్యులు.. ఎనిమిది నెలల గర్భవతి కావడంతో ఉమ్మనీరు తగ్గిందని గ్లూకోజ్‌లు ఎక్కించి పంపించి వేశారు ఆస్పత్రి సిబ్బంది. అయితే, ఇంటికి చేరుకున్న రెండు రోజులుకు ఆమె మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తీవ్రంగా ఆయాసం పడుతుండటంతో తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. సదురు ఆస్పత్రి పట్టించుకోకపోవడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం కరోనా కేసులతో ఆసుపత్రులన్ని నిండిపోవడంతో గర్బిణిని చేర్చుకునేందుకు ఆసుపత్రి వర్గాలు నిరాకరించాయి. దీంతో సరియైన సమయానికి చికిత్స అందక నిండు గర్బిణి ప్రాణాలను కోల్పోయింది. దీంతో ఆ కుటుంబ బాధతో తల్లడిల్లిపోయింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఐదు ఆస్పత్రులు తిరిగిన తమ కూతురును ఎవరూ పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి ట్రీట్మెంట్ లభించకపోవడంతోనే తమ కూతురు చనిపోయిందని వాపోయారు. మూడు గంటల పాటు అంబులెన్స్‌లో తిప్పినా తమ కూతురు దక్కలేదని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

Read Also…  Viral News: గర్బవతి అయిందని ఉద్యోగం నుంచి తీసేసిన సంస్థ.. ఎదురుగా రూ.14లక్షలు చెల్లించింది.!