తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘ ద్వితీయ మహాసభలు నాంపల్లి ఇందిరా ప్రియదర్శని ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సీకే ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ప్రజా స్వామ్యం, ఎన్నికల విధానం అనే అంశంపై సీకే ప్రసాద్ మాట్లాడుతూ.. జర్నలిస్టులు తమ ఉద్యోగ భద్రతో కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. ఎన్నికల విధానంలో సంస్కరణలు జరగాలని అన్నారు. ప్రజా స్వామ్యాన్ని ప్రజలే కాపాడాలని పేర్కొన్నారు. జర్నలిస్టులే ఓటర్లను చైతన్యవంతం చేయాలని తెలిపారు సీకే ప్రసాద్.