Hyderabad: సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న సిబ్బంది..

హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Hyderabad: సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న సిబ్బంది..
Fire Accident

Updated on: Mar 16, 2023 | 8:54 PM

హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్ లోని 7, 8 అంతస్తుల్లో మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో కాంప్లెక్స్ లోని పలు ఆఫీస్‌లు, షాప్‌లు తగలబడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ప్రమాద సమయంలో ఆఫీసుల్లోనే కొందరు ఉద్యోగులు ఉన్నారు. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో పలు బట్టల షాప్‌లు, గోడౌన్‌లు ఉన్నాయి.. వారిలో ఉన్న వారు తమను కాపాడాలంటూ అర్తనాదాలు పెడుతున్నారు. మొత్తం 8 మంది చిక్కుకున్నట్లు పేర్కొంటున్నారు.

అయితే, దట్టమైన పొగతో రెస్క్యూ ఆపరేషన్‌కి ఆటంకం ఏర్పడుతోంది. 6వ ఫ్లోర్‌లో చిక్కుకున్న వాళ్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాంప్లెక్స్‌లో ఎక్కువ క్లాత్‌షాప్‌లు కావడంతో మంటలు ఎగిసిపడుతున్నాలీ. 1980ల్లో నిర్మించిన స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ లో చాలా షాపులు ఉన్నాయని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..