Telangana: మనవరాలి వయస్సున్న బాలికతో అసభ్యప్రవర్తన.. నిందితుడికి షాక్ ఇచ్చిన పోక్సో కోర్టు

నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో మేడ్చల్ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో 64 ఏళ్ల బచ్చన్ ప్రసాద్ షాకు న్యాయమూర్తి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5000 జరిమానా విధించారు.

Telangana: మనవరాలి వయస్సున్న బాలికతో అసభ్యప్రవర్తన.. నిందితుడికి షాక్ ఇచ్చిన పోక్సో కోర్టు
Pocso Case

Updated on: Apr 09, 2025 | 5:09 PM

నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న బచ్చన్ ప్రసాద్ షా (64) ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 64 ఏళ్ల బచ్చన్ ప్రసాద్ విచక్షణ మరిచి తన పక్క ఇంట్లో ఉంటున్న మనవరాలి వయస్సున్న ఓ మైనర్‌ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక కుటుంబసభ్యల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నాచారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అతన్ని మేడ్చల్‌ మల్కాజ్‌గిరి పోక్సో కోర్టులో హాజరుపర్చారు. ఘటనపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడు బచ్చన్ ప్రసాద్ కు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.5000 జరిమానా విధించింది. వీటితో పాటు బాధిత కుటుంబసభ్యులకు రూ.5లక్షల పరిహారం అందేలా ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..