Hyderabad: తాను రాజకీయ నేతనంటూ బడా మోసం.. కట్‌చేస్తే.. పోలీసుల ఎంట్రీతో…

పలుకుబడిని ఉపయోగించి ఏమైనా చేయొచ్చని అనుకుంటారు కొందరు.. ఏం చేసినా చెల్లుతుందని భావిస్తారు మరికొందరు.. బడా బడా నేతల పేరు చెప్పి, బెదిరించి డబ్బులు వసూలు చేసే కేటుగాళ్లు కూడా ఎంతో మంది ఉంటారు. తాజాగా ఇలాంటి ఓ వ్యవహారమే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. పేరున్న ఓ రాజకీయ నాయకుడి పేరు చెప్పి ఓ బిల్డర్‌ నుంచి డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించిన ఓ కేటుగాడు అడ్డంగా పోలీసులకు బుక్కయ్యాడు. అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు పీఎస్‌కు తరలించారు

Hyderabad: తాను రాజకీయ నేతనంటూ బడా మోసం.. కట్‌చేస్తే.. పోలీసుల ఎంట్రీతో...
Hyd Scam

Edited By:

Updated on: Jun 20, 2025 | 11:57 PM

పేరున్న రాజకీయ నాయకుడి పేరు చెప్పి ఓ బిల్డర్‌ నుంచి డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించిన ఓ కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాళ్లోకి వెలితే.. హైదరాబాద్ నగరం షాద్ నగర పరిధిలోని యాకుత్‌పురాలో నివాసం ఉంటున్నట్లు సయ్యద్ అలీమ్‌(36) షాద్‌నగర్‌లో పుట్టి పెరిగాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి యాకుత్‌పురాలో నివాసం ఉంటూ రియల్‌ ఎస్టేట్ వ్యాపవారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ వ్యాపారంలో కొన్ని బాగా డబ్బులు చూసిన అలీమ్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. దీంతో తనకు అంతంత మాత్రంగా వచ్చే సంపాదన ఏ మాత్రం సరిపోకపోవడంతో ఎలాగైనా అక్రమంగా డబ్బు సంపాదించడానికి పథకం పన్నాడు.

అనుకున్నది సాధించి డబ్బులు సంపాదించాలనే ఆలోచనలో ఉన్న అలీమ్‌కు స్థానికంగా యాకుత్‌పురా ప్రాంతంలో ఓ వ్యక్తి కొత్తగా భవనం నిర్మిస్తున్నట్లు తెలుసుకున్నాడు. దీంతో అలీమ్ తనకు తాను స్థానిక రాజకీయ నాయకుడినని, రాష్ట్రంలో బాగా పెద్ద పేరున్న ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులందరూ తనకు తెలుసునని చెప్పుకుంటూ బిల్డర్‌ను సంప్రదించాడు. ఈ క్రమంలోనే ఇక్కడ బిల్డింగ్‌ నిర్మించేందుకు రెండు లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలని బిల్డర్‌ను డిమాండ్ చేశాడు. తను అడిగిన మొత్తాన్ని చెల్లించకపోతే తనకు ఉన్న పలుకుబడితో కొత్తగా నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేస్తానని హెచ్చరించాడు. దీంతో కంగారుపడిపోయిన బాధితుడు ఏం చేయాలో పాలుపోక స్థానిక పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు నిందితుడిపై నిఘా పెట్టారు. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అందె శ్రీనివాస్ రావు, టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ బృందం గాలింపు చేపట్టి నిందితుడు సయ్యద్ అలీమ్‌ను అదుపులోకి తీసున్నారు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుని గతంలో సైతం పలువురి దగ్గర నుంచి సయ్యద్‌ డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు తదుపరి దర్యాప్తు కోసం రెయిన్ బజార్ PS SHOకి అప్పగించారు. దీంతో సయ్యద్‌పై 99/2025, U/s 318,308(3),352(1) r/w 62 BNS సెక్షన్ల కింద రెయిన్ బజార్ పోలీసులు CRలో కేసు నమోదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..