Watch Video: ఇవేం పిచ్చి పనులురా బాబు.. పెళ్లి చేయాలంటూ టవర్‌ ఎక్కిన వ్యక్తి.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి

Man jumps from electricity tower: సెల్‌ఫోన్, విద్యుత్‌ టవర్స్ ఎక్కి తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం తెగ ఫ్యాషన్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చూశాం తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో వెలుగు చూసింది. ఓ వ్యక్తి తనకు పెళ్లిచేయాలని విద్యుత్‌ టవర్‌ ఎక్కాడు. గమనించిన విద్యుత్‌ అధికారులు అతన్ని దింపేప్రయత్నం చేయగా.. అతను పై నుంచి దూకేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతను హాస్పిటల్‌ చికిత్స పొందుతూ మరణించాడు.

Watch Video: ఇవేం పిచ్చి పనులురా బాబు.. పెళ్లి చేయాలంటూ టవర్‌ ఎక్కిన వ్యక్తి.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి
Man Jumps From Electricity Tower

Updated on: Oct 27, 2025 | 10:48 PM

ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయమని, లేదా తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని, ఇలా రకరకాల కారణంగాలో ఈ మధ్య చాలా మంది సెల్‌ఫోన్ టవర్ ఎక్కి తమ డిమాండ్లను నెరవేర్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లోనూ ఒర వ్యక్తి ఇలానే తమ డిమాండ్‌ను నెరవేర్చుకోవాలని ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన ఒక వ్యక్తి తనకు పెళ్లి చేయాలని స్థానికంగా ఉన్న ఒక విద్యుత్‌ టవర్‌ను ఎక్కాడు.
అది గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో క్రైన్, అంబులెన్స్‌తో అధికారులు అక్కడకు చేరుకున్నారు.

హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కిన ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు దించేందుకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అధికారులు పైకి అతన్ని పట్టుకొనేందుకు ప్రయత్నింస్తుండగా.. ఆ వ్యక్తి ఒక్కసారిగా పై నుంచి కిందకు దూకేశాడు. ఇది చూసి అక్కడున్న స్థానికులంతా షాక్ అయ్యారు.

అదృష్టవశాత్తూ అతను పడిపోయిన ప్రదేశంలో బురద ఉండడంతో స్వల్ప గాయాలతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అక్కడే ఉన్న రెస్క్యూ సిబ్బంది క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ సహాయంతో చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతని మృతి చెందాడు. అయితే అతడు టవర్‌పై నుంచి దూకిన దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్‌లలో రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

వీడియో చూడండి..

మరిన్నితెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.