Hyderabad: మహిళను తాకరాని చోట తాకుతూ యువకుడి పైశాచికం.. సీసీటీవీలో రికార్డైన దృశ్యం
వివరాల్లోకి వెళితే.. కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా వెళ్తున్న మహిళ వెంటపడి బలవంతంగా తాకుతూ ఈవ్ టీజింగ్ కి పాల్పడిన యువకుడికి కోర్టు 16 రోజుల జైలు శిక్ష విధించింది. హాఫిజ్ బాబా నగర్ కు చెందిన ఓ మహిళ ఈ నెల 11వ తేదీన ఉదయం కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్‌కు ఒంటరిగా వెళ్తుండగా.. ఆమెను మహమ్మద్ ఇర్ఫాన్ అలీ అనే యువకుడు వెంబడించాడు. గత కొంతకాలంగా ఆమెను తన వశం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న మహమ్మద్ ఇర్ఫాన్ అలీ..
చట్టాలు ఎంత పకడ్బందీగా అమలవుతోన్నా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై అసభ్యకరంగా ప్రవరిస్తే శిక్ష తప్పదని తెలిసినా పాడు బుద్ధి మానుకోవడం లేదు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా వెళ్తున్న మహిళ వెంటపడి బలవంతంగా తాకుతూ ఈవ్ టీజింగ్ కి పాల్పడిన యువకుడికి కోర్టు 16 రోజుల జైలు శిక్ష విధించింది. హాఫిజ్ బాబా నగర్ కు చెందిన ఓ మహిళ ఈ నెల 11వ తేదీన ఉదయం కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్‌కు ఒంటరిగా వెళ్తుండగా.. ఆమెను మహమ్మద్ ఇర్ఫాన్ అలీ అనే యువకుడు వెంబడించాడు. గత కొంతకాలంగా ఆమెను తన వశం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న మహమ్మద్ ఇర్ఫాన్ అలీ.. ఆమె లొంగక పోవడంతో చివరకు బహిరంగంగానే ఆమెపై వేధింపులకు దిగాడు. ఆమెను బైకుపై కూర్చోమని ఆమె వెనుక భాగంలో చేతులతో తాకుతు అసభ్యంగా ప్రవర్తించి ఈవ్ టీజింగ్‌కి పాల్పడ్డాడు. ఇర్ఫాన్ అలీ వేధింపులు ఎక్కువ అవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాధితురాలు ఇక చేసేదేం లేక కాంచన్ బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై ఈ కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. నాంపల్లి 10వ స్పెషల్ మెట్రోపాలిటన్ కోర్టులో నిందితుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీని హాజరు పరచగా.. కోర్టు నిందితుడికి 16 రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.