తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ముందు ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం లేదన్న కారణంతో.. ఓ వ్యక్తి అసెంబ్లీ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన అసెంబ్లీ సిబ్బంది అతణ్ని ఆపి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అసెంబ్లీ వద్దకు చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని సైఫాబాద్(Saifabad) పోలీస్ స్టేషన్ కు తరలించారు. గతంలోనూ అసెంబ్లీ ఎదుట ఇలాంటి ఘటనే జరిగింది. తెలంగాణ అసెంబ్లీ మీటింగ్స్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి అసెంబ్లీ ఎదుట నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో బందోబస్తులో భాగంగా అక్కడే ఉన్న పోలీసులు అతన్ని కాపాడి ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటన మరవకముందే మరో వ్యక్తి అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
F3 Movie: హాట్ సమ్మర్‌లో నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్న ‘ఎఫ్3’.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే
Smart Work: వారేవా..! ఇది కదా స్మార్ట్‌వర్క్ అంటే..! కష్టమైన పనులను సింపుల్‌గా చేస్తున్న వర్కర్లు..