Watch Video: మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం..

|

Apr 19, 2024 | 11:21 AM

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం ఠారెత్తిపోతోంది. అన్ని పార్టీల తీరు ఒక ఎత్తైతే.. మాధవీ లత, అసదుద్దీన్ ల తీరు మరో తీరులా కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలుస్తూ వస్తున్న ఎంఐఎం అధినేతను ఢీ కొట్టేందుకు బీజేపీ నుంచి మాధవీలత బరిలోదిగారు. తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మాధవీలత కామెంట్స్‌ చూసేముందు.. అసలు ఈ గొడవకు కారణమేంటో చూద్దాం.. ప్రచారంలో భాగంగా మాధవీలత చేసి చూపించిన ఓ చర్య ఇది.

Watch Video: మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం..
Hyderabad Lok Sabha
Follow us on

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం ఠారెత్తిపోతోంది. అన్ని పార్టీల తీరు ఒక ఎత్తైతే.. మాధవీ లత, అసదుద్దీన్ ల తీరు మరో తీరులా కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలుస్తూ వస్తున్న ఎంఐఎం అధినేతను ఢీ కొట్టేందుకు బీజేపీ నుంచి మాధవీలత బరిలోదిగారు. తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మాధవీలత కామెంట్స్‌ చూసేముందు.. అసలు ఈ గొడవకు కారణమేంటో చూద్దాం.. ప్రచారంలో భాగంగా మాధవీలత చేసి చూపించిన ఓ చర్య ఇది. మతపరమైన కట్టడం మీదకు బాణం ఎక్కువపెడుతున్నట్లుగా చేశారు.

మాధవీ లత వీడియో..

 

దీనిపై అసద్ ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవీలత తీరు ఎలక్షన్‌ కమిషన్‌, పోలీసులకి కనిపించదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అసదుద్దీన్‌‌ ఒవైసీ. హైదరాబాద్‌లో శాంతికి విఘాతం కలిగించేలా ఆమె చర్యలున్నాయన్నారు ఎంఐఎం చీఫ్‌‌. ఈ నేపథ్యంలోనే మాధవీ లత ఎంఐఎం అధినేతకు కౌంటర్ ఇచ్చారు. అసదుద్దీన్‌ ముస్లింలను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. ఎంఐఎం పతంగి చినిగిపోయే సమయం వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీ అభివృద్ధి చెందడకూడదా అంటూ ప్రశ్నించారావిడ. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

అసదుద్దీన్ వీడియో..

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..