Video: తార్నాకలో ఓ అపార్ట్‌మెంట్‌పై భారీ శబ్ధంతో పిడుగు… సీసీ టీవీ కెమెరాలో రికార్డ్‌

|

Apr 03, 2025 | 8:37 PM

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని వ‌ర్షం ముంచెత్తింది. ఏప్రిల్​ 3న మధాహ్నం 2 గంటలకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో నగరంలోని ప‌లు చోట్ల భారీ వ‌ర్షం కురిసింది. లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై వ‌ర‌ద నీరు నిలిచిపోయింది. వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప‌లు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మండుటెండలో వర్షం కురవడంతో...

Video: తార్నాకలో ఓ అపార్ట్‌మెంట్‌పై భారీ శబ్ధంతో పిడుగు... సీసీ టీవీ కెమెరాలో రికార్డ్‌
Lightning Strike In Tarnaka
Follow us on

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని వ‌ర్షం ముంచెత్తింది. ఏప్రిల్​ 3న మధాహ్నం 2 గంటలకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో నగరంలోని ప‌లు చోట్ల భారీ వ‌ర్షం కురిసింది. లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై వ‌ర‌ద నీరు నిలిచిపోయింది. వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప‌లు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మండుటెండలో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.

అయితే తార్నకలోని ఓ అపార్టుమెంంట్‌లో పిడుగు పడింది. ఎన్‌వీఆర్ స్నిగ్ధ అపార్ట్మెంట్ 5 అంతస్తు పైన ప్రవారీ గోడ అంచుపై పిడుగు పడింది. దీంతో గోడ స్వల్పంగా ధ్వంసం అయింది. భారీ శబ్దంతో పిడుగు పడిందని అపార్ట్మెంట్ వాసులు పేర్కొన్నారు. గోడ విరిగిపడి ఇటుక పెల్లలు తమ గార్డెన్ లో పడిపోయాయని ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని వారు చెప్పారు. భారీ భవంతుల వద్ద పిడుగు నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

 

పిడుగు పడిన సీసీ టీవీ దృశ్యాలు:

 

 

నాలుగు రోజులు పిడుగులు పడే ఛాన్స్‌: వాతావరణశాఖ

తెలంగాణ, కోస్తా, మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షం కురిసింది. వాతావరణ శాఖ అంచనా మేరకు వచ్చేనాలుగు రోజుల పాటు నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోను మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.రానున్న నాలుగు రోజులు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.