రద్దీ తగ్గట్టుగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న రైల్వే శాఖ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రజల నడ్డీ విరిచేలా పార్కింగ్ ఫీజులతో భయపెడుతుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పార్కింగ్ ఫీజుతో జనలు జడుచుకుంటున్నారు. కారు పార్కింగ్ చేసిన ఓ వ్యక్తి నుంచి భారీగా ఛార్జీ వసూలు చేశారు. వందో, రెండు వందలో కాదు ఏకంగా రూ.500 వసూలు చేశారు. బ్రిగేడియర్ జైరత్ అనే ప్రయాణికుడు తన వాహనాన్ని 31 నిమిషాలపాటు పార్కింగ్ చేసినందుకుగాను అతడి నుంచి రూ.500 వసూలు చేశారు. పార్కింగ్ బిల్‌ను జైరత్ పురపాల శాఖ మంత్రికి ట్వీట్ చేశాడు.
అతడి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. అది నిజంగా దారుణమన్నారు. ఈ అంశంపై స్పందించాలంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రీట్వీట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి రెండువైపులా పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. దక్షిణ మధ్య తాజా నిబంధనల ప్రకారం ఇక్కడ రెండు గంటల పాటు టూ వీలర్ నిలిపి ఉంచితే రూ.15, ఫోర్ వీలర్ నిలిపితే రూ.50 పార్కింగ్ ఫీ వసూల్ చేయాలి కానీ అందుకు విరుద్ధంగా భారీగా ఫీజు వసూలు చేస్తున్నారు.
Atrocious indeed!
Request Railway minister @AshwiniVaishnaw Ji to direct officials to do away with fleecing citizens as pointed out by Brigadier Jairath ji ? https://t.co/Wt0GlSWFRQ
— KTR (@KTRTRS) November 10, 2021
Read Also..TS Politics: కేసీఆర్ మోసాలకు త్వరలోనే చరమగీతం పాడతాం.. ఎమ్మెల్యే ఈటెల విమర్శలు..
Road Accident: దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృతిSCCL: సింగరేణి ఘటనలో నలుగురి మృతదేహాలు లభ్యం.. సంతాపం తెలిపిన మంత్రులు.. కార్మికులకు అండగా ఉంటామన్న సీఎండీ