Hyderabad: ప్రాణాలకు తెగించి తల్లీకూతుళ్లకు ప్రాణం పోసిన కానిస్టేబుల్‌.. మంత్రి కేటీఆర్‌ అభినందనలు అందుకున్నఈ రియల్‌ హీరో ఏం చేశాడంటే..

|

Feb 14, 2022 | 7:56 AM

విధి నిర్వహణలో చేరేటప్పుడు ప్రాణాలను ఫణంగా పెట్టైనా ప్రజలను రక్షిస్తామని చేసిన ప్రతిజ్ఞకు ప్రాణం పోశాడు ఓ కానిస్టేబుల్. విధి నిర్వహణకు కట్టుబడ్డాడు.

Hyderabad: ప్రాణాలకు తెగించి తల్లీకూతుళ్లకు ప్రాణం పోసిన కానిస్టేబుల్‌.. మంత్రి కేటీఆర్‌ అభినందనలు అందుకున్నఈ రియల్‌ హీరో ఏం చేశాడంటే..
Follow us on

విధి నిర్వహణలో చేరేటప్పుడు ప్రాణాలను ఫణంగా పెట్టైనా ప్రజలను రక్షిస్తామని చేసిన ప్రతిజ్ఞకు ప్రాణం పోశాడు ఓ కానిస్టేబుల్. విధి నిర్వహణకు కట్టుబడ్డాడు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దట్టమైన మంటల్లో చిక్కుకున్న తల్లీ కూతుళ్లను కాపాడాడు. రియల్ హీరో అనిపించుకున్నాడు. అతనే పంజాగుట్ట (Panjagutta) ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ శ్రావణ్ కుమార్ (Sravan Kumar) . ఇలా ప్రాణాలకు తెగించి తల్లీకూతుళ్లకు ప్రాణం పోసిన శ్రావణ్‌ సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మంత్రి కేటీఆర్‌ (KTR) కూడా ట్విట్టర్‌ వేదికగా ట్రాఫిక్ కానిస్టేబుల్‌ ను అభినందించారు. అద్భుత సాహసం చేశారని కొనియాడారు. అదేవిధంగా శ్రావణ్‌ ధైర్య సాహసాలకు .. రివార్డు ఇవ్వాలంటూ హోంమంత్రి మహమూద్‌ అలీని ట్విట్టర్‌ లో ట్యాగ్ చేశారు.

అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ పంజాగుట్టలోని జూబ్లీ మెడికల్‌ షాపుపైన నాలుగు అంతస్తులో ఉన్నట్లుండి మంటలు వ్యాపించాయి. తల్లీకూతుళ్లు అగ్నికీలల్లో చిక్కుకున్నారు. వారిని కాపాడాలని చాలా మందికి ఉన్నా.. ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. అదే సమయంలో సమాచారం అందుకున్న పంజాగుట్ట ట్రాఫిక్‌ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ అక్కడి చేరుకున్నాడు. అప్పటికే అపార్ట్‌మెంట్‌లో మంటలు వ్యాపించడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. స్థానికులు వద్దని వారిస్తున్నా మంటలను సైతం లెక్కచేయకుండా డ్రైనేజీ పైప్‌ ద్వారా అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులోకి చేరుకున్నాడు. అగ్నికీలల్లో చిక్కుకున్న తల్లీకూతుళ్లను రక్షించాడు. అందరూ ఏమవుతుందోనని ఆందోళనతో చూస్తుండగా.. ఇద్దరినీ కాపాడి సురక్షితంగా కిందకు తీసుకొచ్చాడు మన కానిస్టేబుల్​. కాగా ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో తన కర్తవ్యంతో తల్లీకూతుళ్లను కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్‌కుమార్‌ను స్థానికులు అభినందించారు. అనంతరం మంత్రి కేటీఆర్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ రియల్‌ హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

Also Read: Kim Jong Un: మరోసారి వార్తల్లో నిలిచిన ఉత్తర కొరియా నియంత.. బ్లాస్టింగ్‌తో హౌసింగ్‌ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన కిమ్‌..

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపటి నుంచే ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ.. పూర్తి వివరాలివే..

RCB, IPL 2022 Auction: కీలక ఆటగాళ్లతో ట్రోఫీకి సిద్ధమైన బెంగళూరు.. కోహ్లీ టీంలో ఎవరున్నారంటే?