హైదరాబాద్: గత ఐదేళ్లలో సింగరేణి కాలరీస్ అద్భుతమైన పనితీరు కనబరిచిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గణనీయ వృద్ధి సాధించిందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం రూ.11,929 కోట్లుగా ఉన్న అమ్మకాలు.. 117శాతం పెరిగి 25,828 కోట్లకు చేరాయన్నారు. అలాగే, సింగరేణి లాభాలు రూ.419 కోట్ల నుంచి 288 శాతం పెరిగి రూ.1600 కోట్లకు పెరిగాయన్నారు. ఇందుకు కృషిచేసిన సింగరేణి సీఎండీ శ్రీధర్, సిబ్బందికి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
Singareni Collieries has performed exceptionally last 5 years under the leadership of Hon’ble CM KCR Garu?
Sales have grown from ₹11,928Cr to ₹25,828Cr (by 117%)
Profits have grown from ₹419Cr to ₹1600Cr (by 282%)
My compliments to the employees of SCCL & CMD Sridhar Garu pic.twitter.com/xVmLLaSu2E
— KTR (@KTRTRS) May 17, 2019