Teachers Constituency: టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఓటు హక్కు కోసం దరఖాస్తుల ఆహ్వానం.. ఎలా చేయాలంటే..?

|

Oct 06, 2022 | 7:47 PM

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ శాసన మండలి టీచర్ నియోజకవర్గంలో ఆసక్తి, అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని శాసన మండలి టీచర్ నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పంకజ కోరారు.

Teachers Constituency: టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఓటు హక్కు కోసం దరఖాస్తుల ఆహ్వానం.. ఎలా చేయాలంటే..?
Voters Registration
Follow us on

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ శాసన మండలి టీచర్ నియోజకవర్గంలో ఆసక్తి, అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని శాసన మండలి టీచర్ నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పంకజ కోరారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. శాసన మండలి టీచర్ నియోజకవర్గంలో ఓటరు నమోదుకు అక్టోబర్ 1 నోటిఫికేషన్ జారీ చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు ఓటరు నమోదుకు ఫారం-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే ఈ నియోజకవర్గంలో ఆరు సంవత్సరాల పాటు స్థానికంగా నివాసితులై ఉండాలని తెలిపారు. మూడు సంవత్సరాల పాటు ఏదైనా పాఠశాలలో టీచర్‌గా పని చేసిన అనుభవం గలవారు అర్హులు అని వివరించారు.

ఓటరు నమోదుకు సంబంధిత ఇఆర్ఓలు, అసిస్టెంట్ ఇఆర్ఓలు, సంబంధిత జిల్లాల ఆర్డీవో, తహశీల్దార్లు, జీహెచ్ఎంసీ పరిధిలో నియోజకవర్గ ఇఆర్ఓలుగా వ్యవహరిస్తున్న డిప్యూటీ కమిషనర్లను సంప్రదించి ఫారం 19 ద్వారా ఆఫ్‌లైన్ లో దరఖాస్తు పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం సంబంధిత సర్వీస్ సర్టిఫికెట్లను జత చేసి తిరిగి అక్కడే అందజేయాలని సూచించారు.

ఆన్‌లైన్ లో సీఈవో వెబ్ సైట్ ద్వారా కూడా ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్ లో అప్లై చేసేవారు కూడా సర్వీస్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్ పంకజ సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..