
నరహంతకుడు కాదు. కరడుగట్టిన నేరస్తుడూ కాదు. విద్యార్థులకు పాఠాలు చెప్పే అధ్యాపకుడు. తన జ్ఞానం పదిమందికీ పంచాలనుకునే విద్యావంతుడు. వీల్‌ఛైర్‌నుంచే భవిష్యత్తు ప్రపంచాన్ని వీక్షించిన స్వప్నికుడు. ఓరోజు ఆయన చట్టం దృష్టిలో దేశద్రోహి అయ్యారు. చేయని నేరానికి పదేళ్లు శిక్ష అనుభవించారు. మానసికంగా శారీరకంగా పీల్చిపిప్పిచేసిన ఈ వ్యవస్థపై అలుపెరగని పోరాటంలో చివరికి గెలిచారు. కానీ మరణాన్ని జయించలేకపోయారు. ప్రొఫెసర్ సాయిబాబా అమర్‌రహే.. ఆయన తుదిశ్వాస తర్వాత మనసున్న ప్రతీ గుండెలో మారుమోగుతున్న నినాదమిదే. ఎందుకు ఈ వ్యవస్థ ముందు సాయిబాబా దోషిగా నిలబడాల్సి వచ్చింది? పదేళ్లు జైలు గోడల మధ్య ఎందుకు మగ్గాల్సి వచ్చింది? వైకల్యాన్ని జయించి ఈ స్థాయికి ఎదిగిన ప్రొఫెసర్.. 57ఏళ్ల వయసులోనే ఎందుకు మరణించాల్సి వచ్చింది?.. హక్కుల కోసం తపించే గుండె సవ్వడి ఆగిపోయింది.. ప్రశ్నించే ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది.. వైకల్యం శరీరానికే కానీ ఆయన మనసుకి కాదు.. అంతులేని ఆలోచనల విస్ఫోటనంలాంటి ఆ మెదడు జ్ఞాపకాల దొంతరలను మిగిల్చింది.. 90శాతం వైకల్యం. ఒకరి సహాయం లేకుండా కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని ఆ దేహం కొందరిని ఎందుకంత భయపెట్టింది? ఆ వీల్‌ఛైర్ చక్రాల కదలిక కూడా కొందరికి ఎందుకంత ప్రమాదకరంగా కనిపించింది? జైలు గోడల మధ్యే ఆ ఊపిరి ఆగిపోవాలని కోరుకునేంత నేరం ఆయనేం చేశారు. దుర్భేద్యమైన జైలు గోడల మధ్య కూడా పదేళ్లు మొండికేసి నిలిచిన ప్రాణం.. బయటికొచ్చేసరికి అలసిపోయింది. ఇక సెలవంటూ వెళ్లిపోయింది. పరిచయం...