Asaduddin Owaisi: బీఆర్ఎస్‌పై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం మద్దతు కాంగ్రెస్‌కేనా?

MIM.. ఒకప్పుడు బీఆర్‌ఎస్‌కు సపోర్ట్.. ఇప్పుడు, అదే పార్టీపై విమర్శలు. గాలి వాటు పయనం అన్నట్టుగా.. అధికారపక్షం వైపే గాలిపటం ఎగురుతోందా? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వ్యూహంపై ఆ పార్టీ క్లారిటీ వచ్చినట్టేనా? పతంగి, ఎవరి చేతిలో ఉన్నట్టు?.. అనేది చర్చనీయాంశంగా మారింది.

Asaduddin Owaisi: బీఆర్ఎస్‌పై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం మద్దతు కాంగ్రెస్‌కేనా?
Asaduddin Owaisi

Updated on: Oct 03, 2025 | 8:27 PM

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అప్పుడు ముద్దు అన్న పార్టీనే ఇప్పుడు వద్దు అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు బీఆర్ఎస్ పాలన కొనసాగింది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో BRS ఎమ్మెల్యేగా మాగంటి పనిచేశారు. జూబ్లీహిల్స్‌ను మోడల్ నియోజకవవర్గంగా మార్చే అవకాశం వచ్చినా.. ఆ దిశగా BRS పనిచేయలేదంటూ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు చేశారు.

చురుకైన వ్యక్తిని జూబ్లీహిల్స్‌ ఓటర్లు ఎంచుకోవాలి

పెళ్లి కొడుకులా వచ్చి పోయే వాళ్లని కాకుండా చురుకైన వ్యక్తిని జూబ్లీహిల్స్‌ ఓటర్లు ఎంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే మనవాడైతేనే పనులు జరుగుతాయన్నారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఆటలు సాగనివ్వం అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

కాంగ్రెస్ గెలుపు కోసమే పతంగి పార్టీ పనిచేయబోతోందా?

అటు బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. ఇటు బీజేపీపై యుద్ధమే చేస్తున్నారు. అంటే.. MIM మద్దతు కాంగ్రెస్‌కేనా? జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు కోసమే పతంగి పార్టీ పనిచేయబోతోందా? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో పెద్ద చర్చ.

జూబ్లీహిల్స్‌లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముస్లింలు

జూబ్లీహిల్స్‌లో 3లక్షల 92వేల 669 ఉంటే.. అక్షరాలా 96వేల 546మంది.. ముస్లిం ఓటర్లు ఉన్నారు. 25శాతం ఉన్న ముస్లింలు జూబ్లీహిల్స్‌లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఈ లెక్కన.. గెలుపోటములను ప్రభావితం చేసే శక్తి MIMకు ఉంది. MIM పోటీ చేస్తుందా.. లేక, అంతర్గతంగా కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతుందా.. అనేది చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..