AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అదిగో వెంచర్‌.. ఇక్కడే మీ ఫ్లాట్‌.. లచ్చలు లచ్చలు పోశారు.. ఆ తర్వాత సీన్ ఇది..

సొంత ఇంటి కల నెరవేరుస్తామంటూ జనానికి మాయమాటలు చెప్పారు కాకర్ల శ్రీనివాస్‌ అండ్‌ టీమ్. అదిగో అక్కడే వెంచర్‌.. ఇదిగో ఇక్కడే మీ ఫ్లాట్‌ కట్టేది అంటూ అరచేతిలో స్వర్గం చూపించారు. నమ్మి డబ్బు కట్టినవాళ్లను నిలువునా ముంచేశారు. జయత్రి ఇన్‌ఫ్రా పేరుతో జనానికి వందల కోట్ల కుచ్చుటోపీ పెట్టారు. వంచన వెంచర్స్ వలలో చిక్కుకున్నవాళ్లు ఇప్పుడు విలవిల్లాడుతున్నారు.

Hyderabad: అదిగో వెంచర్‌.. ఇక్కడే మీ ఫ్లాట్‌.. లచ్చలు లచ్చలు పోశారు.. ఆ తర్వాత సీన్ ఇది..
Jayathri Infra Fruad
Shaik Madar Saheb
|

Updated on: Jun 02, 2025 | 12:35 PM

Share

హైదరాబాద్ నగరంలో మరో భారీ మోసం బయటపడింది. వెంచర్లు, ఫ్లాట్‌లు, రిసార్ట్స్‌, మెట్రో స్టేషన్‌లో రెంటల్స్‌ స్టాల్స్‌ అంటూ జయత్రి ఇన్‌ఫ్రా వల విసిరేసింది. అది నమ్మి రిటైర్‌మెంట్‌ డబ్బులు, ఏళ్ల తరబడి కూడబెట్టిన సొమ్మును.. కాకర్ల శ్రీనివాస్‌ అండ్‌ టీమ్‌ చేతిలో పోశారు జనం. ఫ్లాట్‌ రేటులో 30 నుంచి 70 శాతం ముందే కట్టించుకున్నారు. సీన్ కట్‌ చేస్తే.. రియల్ చీటర్‌ అసలు రంగులు బయటపడ్డాయి. డబ్బు కట్టిన తర్వాత కాకర్ల అండ్‌ టీమ్‌ కనిపించకుండా పోవడంతో, మోసపోయామని బాధితులు గ్రహించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. దాదాపు రూ.350 కోట్ల రూపాయలను కాకార్ల శ్రీనివాస్ వసూలు చేశాడని బాధితులు పేర్కొంటున్నారు.  ఒక్కొక్కళ్లకు రూ. 20 లక్షల నుంచి కోటి 80 లక్షల దాకా టోపీ పెట్టాడు..

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న KPHB పోలీసులు కాకర్లను అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత విడుదలైన కాకర్ల మళ్లీ గాయబ్‌ అయ్యాడు. కాళ్లరిగిపోయేలా కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరిగినా, పోలీసులు పట్టించుకోవట్లేదని బాధితులు వాపోతున్నారు. హైకోర్టు ఆదేశించినా కూకట్‌పల్లి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు బాధితులు.

2020లో అనాథాశ్రమం పేరుతో మోసం

ఈ వంచన వెంచర్స్‌ కథా చిత్రమ్‌లో జయత్రి ఇన్‌ఫ్రా ఎండీ కాకర్ల శ్రీనివాస్‌ మెయిన్‌ యాక్టర్‌ అని, హరిప్రసాద్ , బొల్లా శ్రీనివాసరావు, మునీశ్వర్, దొరబాబు లాంటి డైరెక్టర్లు ఛోటా యాక్లర్లంటున్నారు బాధితులు. ఇదే కాకర్ల శ్రీనివాస్‌ అండ్‌ టీమ్‌ గతంలో కూడా మోసాలు చేసిందంటున్నారు బాధితులు. 2020లో మియాపూర్‌లో అనాథ శరణాలయం పేరుతో కోటి రూపాయలు నొక్కేసి, అప్పటినుంచి తప్పించుకుని తిరుగుతున్నాడంటున్నారు అతగాడి బాధితులు. 2023 నుంచి జయత్రి ఇన్‌ఫ్రా వలలో చిక్కుకుని కోట్ల రూపాయలు పోగొట్టుకుని తాము కూడా అతగాడి కోసం గాలిస్తున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వాళ్లు కోరుతున్నారు. ఇంటి కల చెదిరిపోయి, దాచుకున్న డబ్బు కోల్పోయిన బాధితులు, న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.. ప్రత్యేకతలివే..
భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.. ప్రత్యేకతలివే..
గుడ్లు, చికెన్, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? కారణం ఇదే!
గుడ్లు, చికెన్, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? కారణం ఇదే!
రోజును బట్టి దీపంలో ఇవి వేయండి.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెరుగుతాయట
రోజును బట్టి దీపంలో ఇవి వేయండి.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెరుగుతాయట
ప్రపంచంలోనే అత్యంత సన్నని కారు ఇదే..!
ప్రపంచంలోనే అత్యంత సన్నని కారు ఇదే..!
కుజుడు, గురువు అనుగ్రహం.. ఆ రాశులకు నీచభంగ రాజయోగం!
కుజుడు, గురువు అనుగ్రహం.. ఆ రాశులకు నీచభంగ రాజయోగం!
అక్కడ 600 వసతిగృహాలకు ఒకటే తాళం.. సిబ్బంది, వంటవాళ్లు ఉండరు..!
అక్కడ 600 వసతిగృహాలకు ఒకటే తాళం.. సిబ్బంది, వంటవాళ్లు ఉండరు..!
సికింద్రాబాద్ - విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్
సికింద్రాబాద్ - విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి