Hyderabad: నల్లా బిల్లు కట్టలేదని మెసేజ్ వచ్చిందా.? అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి

కొంద‌రు అజ్ఞాత వ్య‌క్తులు గుర్తు తెలియ‌ని మొబైల్‌ నెంబ‌ర్ల‌ నుంచి జ‌ల‌మండ‌లి న‌ల్లా బిల్లు చెల్లించ‌కుంటే క‌నెక్ష‌న్ తొల‌గిస్తామ‌ని తప్పుడు స‌మాచారాన్ని వినియోగ‌దారుల‌కు SMS ద్వారా చేర‌వేస్తున్నార‌ని జ‌ల‌మండ‌లి దృష్టికి వ‌చ్చింది. అలాంటి మెసేజ్‌ల‌కు స్పందించ‌కూడ‌దని జ‌ల‌మండ‌లి విజ్ఞ‌ప్తి చేస్తోంది. ఆ వివరాలు..

Hyderabad: నల్లా బిల్లు కట్టలేదని మెసేజ్ వచ్చిందా.? అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి
Hyderabad Water

Edited By:

Updated on: May 30, 2025 | 9:07 PM

కొంద‌రు అజ్ఞాత వ్య‌క్తులు గుర్తు తెలియ‌ని మొబైల్‌ నెంబ‌ర్ల‌ నుంచి జ‌ల‌మండ‌లి న‌ల్లా బిల్లు చెల్లించ‌కుంటే క‌నెక్ష‌న్ తొల‌గిస్తామ‌ని తప్పుడు స‌మాచారాన్ని వినియోగ‌దారుల‌కు SMS ద్వారా చేర‌వేస్తున్నార‌ని జ‌ల‌మండ‌లి దృష్టికి వ‌చ్చింది. అలాంటి మెసేజ్‌ల‌కు స్పందించ‌కూడ‌దని జ‌ల‌మండ‌లి విజ్ఞ‌ప్తి చేస్తోంది. మొబైల్ నెంబ‌ర్ 84271 56645 నుంచి ఈ రాత్రి 9:30 నిమిషాల‌కు గ‌త‌ నెల బిల్లు చెల్లించ‌క‌పోతే మీ న‌ల్లా క‌నెక్ష‌న్‌లు తొల‌గిస్తామ‌ని మెసేజ్ పంపిస్తున్నారు. అలాగే మ‌రిన్ని వివ‌రాల‌ కోసం 9064953421ను సంప్రదించమ‌ని పేర్కొంటున్నారు.

ఆ నెంబ‌ర్‌ను సంప్ర‌దించ‌గానే ప్రాసెసింగ్ కోస‌మ‌ని APK ఫైల్‌ను వాట్సాప్‌ ద్వారా పంపిస్తారు. అయితే ఈ విష‌యంపై ఇలాంటి మెసేజ్‌లు జ‌ల‌మండ‌లి పంపించిన‌వి కావ‌ని, హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ఇటువంటి సందేశాల‌కు స్పందించ‌కుండా, పై నెంబ‌ర్‌ల‌ను సంప్ర‌దించ‌కుండా, వాట్సాప్‌కు వ‌చ్చిన APK ఫైల్‌ల‌ను డౌన్‌లోడ్ చేయ‌కుండా/ఇన్‌స్టాల్ చేయ‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జ‌ల‌మండ‌లి వినియోగ‌దారుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తోంది. జ‌ల‌మండ‌లి నుంచి అన్ని అధికారిక‌ స‌మాచారాలు కేవ‌లం అధికారిక‌ మార్గాల ద్వారా జారీ చేస్తుంది. ఈ విష‌య‌మైనా.. ఏవైనా స‌మ‌స్య‌లు లేదా సేవా సంబంధిత సందేహాలు ఉంటే జ‌ల‌మండ‌లి క‌స్ట‌మ‌ర్ కేర్ 155313కి సంప్ర‌దించాల‌ని కోరుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి